Biker OTT: శర్వానంద్ ‘బైకర్’ ఓటిటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
శర్వానంద్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ 'బైకర్' ఓటిటీ(Biker OTT) డేట్ ఫిక్స్ చేసుకుంది.
Sharwanand biker movie coming to Netflix, streaming from May 1st.
- మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో బైకర్ స్ట్రీమింగ్.
- శర్వానంద్, రాజశేఖర్ తండ్రీకొడుకుల రేసింగ్ డ్రామా.
- హిందీలో ‘శర్వా’ పేరుతో విడుదల కానుంది.
Biker OTT: టాలీవుడ్ హీరో శర్వానంద్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ బైకర్. కొత్త అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదలై మంచి విజయాన్ని సాధించింది. మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ విభిన్నమైన స్పోర్ట్స్ డ్రామా, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళను సాధించి సేఫ్ ప్రాజెక్ట్‌గా నిలిచింది. థియేటర్లలో అలరించిన ఈ చిత్రం ఇప్పుడు నెల తిరగకముందే డిజిటల్ ప్రియులను పలకరించేందుకు సిద్ధమైంది.
Tollywood Heroes: నటన, రచన, నిర్మాణం, దర్శకత్వం.. టాలీవుడ్ యంగ్ హీరోల ‘ఆల్ ఇన్ వన్’ షో
తాజా సమాచారం ప్రకారం ‘బైకర్’ మూవీ మే 1వ తేదీ నుంచి ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Biker OTT)లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ‘బైకర్’ పేరుతోనే ఈ చిత్రం అందుబాటులోకి రానుండగా, హిందీ వెర్షన్లో మాత్రం ‘శర్వా’ అనే టైటిల్‌తో విడుదల కానుంది. థియేటర్లలో మిస్ అయిన వారికి, శర్వానంద్ నటనను ఇష్టపడే వారికి ఈ సమ్మర్ లో ఇదొక చక్కని ఎంటర్టైన్మెంట్ కానుంది. మే డే కానుకగా రాబోతున్న ఈ సినిమా ఓటిటీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
