Shefali Shah : పబ్లిక్‌లో అంత చీప్ గా బిహేవ్ చేస్తారు.. మహిళలు వీటిపై స్పందించాలి..
తాజాగా షెఫాలీ షా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ఈ ఇంటర్వ్యూలో షెఫాలీ షా కొంతమంది అబ్బాయిలు పబ్లిక్ ప్లేస్ లలో అమ్మాయిలతో ఎంత చీప్ గా బిహేవ్ చేస్తారో తెలిపింది.

Shefali Shah comments on some boys openly misbehaving with women
Shefali Shah : ఆర్జీవీ(RGV) రంగీలా(Rangeela) సినిమాతో బాలీవుడ్(Bollywood) లో ఎంట్రీ ఇచ్చింది నటి షెఫాలీ షా(Shefali Shah). ఆ తర్వాత కొన్ని బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా చేసి అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఇప్పుడు కూడా అడపాదడపా సినిమాలు చేస్తుంది షెఫాలీ షా. నెట్ ఫ్లిక్స్(Netflix) లో వచ్చిన ‘ఢిల్లీ క్రైమ్స్'(Delhi Crimes) సిరీస్ లో పోలీసాఫీసర్ గా నటించి మెప్పించడంతో ఇప్పుడు ఓటీటీలో(OTT) వరుసగా ఛాన్సులు సంపాదిస్తుంది షెఫాలీ.
తాజాగా షెఫాలీ షా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ఈ ఇంటర్వ్యూలో షెఫాలీ షా కొంతమంది అబ్బాయిలు పబ్లిక్ ప్లేస్ లలో అమ్మాయిలతో ఎంత చీప్ గా బిహేవ్ చేస్తారో తెలిపింది.
Urvashi Rautela : ఏజెంట్ లో ఐటెం సాంగ్ కోసం మెగాస్టార్ భామ.. అటు రామ్ – బోయపాటి సినిమాలో కూడా..
షెఫాలీ షా మాట్లాడుతూ.. నేను ఎదుర్కున్న సంఘటనలు చాలా మంది మహిళలు రోజూ ఎదుర్కొంటూనే ఉన్నారు. ఓ సారి రద్దీగా ఉన్న మార్కెట్ కి వెళ్ళినప్పుడు నన్ను ఎవరో అసభ్యకరంగా పట్టుకున్నారు. అప్పుడు నాకు చాలా చిరాకు, కోపంగా అనిపించింది. అది అనుకోకుండా జరిగింది కాదు, కావాలని చేసిందే. సిగ్గులేని వాళ్ళు చేసిన ఓ పని అది. దీనిపై అప్పుడు నేను స్పందించలేకపోయాను. నేనే కాదు చాలా మంది మహిళలు ఇలాంటి వాటిపై అంత తొందరగా స్పందించరు. మనం ఏం తప్పు చేయనప్పుడు రియాక్ట్ కాకుండా వదిలేయకూడదు. ఇలాంటి సంఘటనల్లో మహిళలు తీవ్రంగా స్పందించాలి. అప్పుడే మరో మహిళకు ఇలా జరగకుండా ఉంటుంది అని తెలిపింది.