Sherlyn Chopra : రాజ్ కుంద్రాపై షెర్లిన్ చోప్రా లైంగిక ఆరోపణలు..

వద్దంటున్నా వినకుండా రాజ్ కుంద్రా తనను బలవంతం చేశాడని చెప్పింది షెర్లిన్ చోప్రా..

Sherlyn Chopra : రాజ్ కుంద్రాపై షెర్లిన్ చోప్రా లైంగిక ఆరోపణలు..

Sherlyn Chopra

Updated On : July 29, 2021 / 2:14 PM IST

Sherlyn Chopra: అశ్లీల చిత్రాల నిర్మాణం, బాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న మహిళలను పోర్న్ వీడియోల్లో నటించమని బలవంతం చెయ్యడం వంటి ఆరోపణలు నిర్ధారణ కావడంతో నటి శిల్పా శెట్టి భర్త, బిజినెస్‌మెన్ రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ చెయ్యడం, బెయిల్ రిజెక్ట్ చేసి, 14 రోజులు రిమాండ్ పొడిగించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. దీంతో బాలీవుడ్‌లో రాజ్ కుంద్రాతో ఎవరెవరకి సంబంధాలున్నాయనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు.

Raj Kundra : ఆ వీడియోల ద్వారా రాజ్ కుంద్రా రోజుకు ఎంత సంపాదించేవాడంటే..

శిల్పా శెట్టిని కూడా దాదాపు ఆరు గంటలపాటు విచారించారు. హీరోయిన్లు పూనమ్ పాండే, గెహనా వశిష్ట్.. ఇద్దరి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. రీసెంట్‌గా షెర్లిన్ చోప్రా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరయ్యింది. తనకు రాజ్ కుంద్రాతో సంబంధాలు ఉండడం, పోర్నే గ్రఫీ కేసులో అతను అరెస్ట్ కావడంతో భయపడ్డ షెర్లిన్ ముందస్తు బెయిల్ కోసం ముంబై సెషన్స్ కోర్టులో అప్లై చేసుకోగా బెయిల్ లభించింది. విచారణలో కుంద్రా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిందామె. వద్దంటున్నా వినకుండా తనను బలవంతం చేశాడని చెప్పుకొచ్చింది.

Sagarika Shona Suman : నగ్నంగా ఆడిషన్ అడిగాడు.. శిల్పా శెట్టి భర్తపై నటి షాకింగ్ కామెంట్స్..

‘2019 లో ‘ది షెర్లిన్ చోప్రా యాప్’ అనే ఐడియాతో రాజ్ కుంద్రా తన బిజినెస్ మేనేజర్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయ్యారు. కుంద్రాను తన ఆఫీసులో కలిశాను. వీడియోలు అప్‌లోడ్, రెవెన్యూ వంటి వివరాలు చెప్పారు. మాట్లాడుతూనే నన్ను కౌగలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం చేశాడు. వద్దన్నా వినకుండా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నా భార్య కాంప్లికేటెడ్.. నేను ఎక్కువగా స్ట్రెస్ అవుతున్నాను అంటూ హద్దు దాటబోయాడు. దాంతో తనను తోసేసి తప్పించుకోవడానికి వాష్‌రూమ్‌లోకి వెళ్లిపోయాను’ అంటూ విచారణలో చెప్పుకొచ్చింది షెర్లిన్ చోప్రా. లైంగిక వేధింపుల కేసులో షెర్లిన్ 2021 ఏప్రిల్‌లో కుంద్రాపై కంప్లైంట్ చేసిందని సమాచారం.