ఒళ్లు విల్లులా ఒంగుతుంటే ఏజ్ అనేది జస్ట్ నెంబర్..

కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ఇళ్లకే పరిమితమైన సినీ నటులు అనుకోకుండా దొరికిన ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. చేయాలనుకుని చేయలేనివి, ఇష్టమైనవి చాలా పనులు చేస్తున్నారు. పనిమనుషులు రాకపోవడంతో తమ పని తామే చేసుకుంటున్నారు.వర్కౌట్స్ దగ్గరినుండి వంట చేయడం వరకు.. ఇంటి పని నుండి గార్డెనింగ్ వరకు అన్నీ పనులను ఓ పట్టు పడుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ నటి శిల్పాశెట్టి సూర్యనమస్కారాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సూర్య నమస్కారాలు పలు రకాలు అంటూ శిల్పాశెట్టి షేర్ చేసిన వీడియోలో ఆమె బాడీ ఎంతో ఫ్లెక్సిబుల్‌గా బెండ్ అవుతోంది. శిల్పా యోగా వీడియోలు ఇప్పటికీ ఫిట్‌నెస్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటాయనే సంగతి తెలిసిందే. 40+లోనూ శిల్పా ఫిట్‌నెస్ పట్ల తీసుకుంటున్న శ్రద్ధ, ఆమె బాడీ బెండ్ అవుతున్న తీరు చూసి.. ‘ఒళ్లు విల్లులా ఒంగుతుంటే ఏజ్ అనేది జస్ట్ నెంబర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.