Sharwanand : శర్వానంద్ సినిమాలో.. ఆ హీరో సెకండ్ లీడ్ చేస్తున్నాడట..
ప్రస్తుతం శర్వానంద్ తన 35వ సినిమాని శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేస్తున్నాడు.

Shiva Kandukuri Playing Second Lead in Sharwanand 35th Movie
Sharwanand : శర్వానంద్ 2022 లో ఒకేఒక జీవితం సినిమాతో వచ్చి మెప్పించాడు. ఆ తర్వాత ఇప్పటివరకు మళ్ళీ కనపడలేదు. ప్రస్తుతం శర్వానంద్ తన 35వ సినిమాని శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో సెకండ్ లీడ్ గా హీరో శివ కందుకూరి(Shiva Kandukuri) చేస్తున్నాడట. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడిగా శివ కందుకూరి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా హీరోగా చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాతో వచ్చి మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో శివ కందుకూరి ఈ విషయాన్ని తెలిపాడు.
Also Read : Gopichand : గోపీచంద్ చేస్తున్న మంచి పని.. కానీ ఎవ్వరికి తెలీదు.. ఎంతోమంది పిల్లలకు..
శివ కందుకూరి మాట్లాడుతూ.. నేను హీరోగా చేస్తాను, మంచి పాత్రలు వస్తే క్యారెక్టర్స్ కూడా చేస్తాను. శర్వా 35 సినిమాలో సెకండ్ లీడ్ చేస్తున్నాను. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది అని తెలిపాడు. మరి శర్వానంద్ ఈ సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.