Shiva : భారీ యాక్సిడెంట్.. తలకు గాయం.. 13 రోజులు కోమాలో.. 18వ రోజు లేచి షూట్‌కి.. ఎమోషనల్ జర్నీ..
శివ కుమార్ యాక్సిడెంట్ కి గురయి కోమాలో ఉండి లేచి వచ్చి మళ్ళీ వెంటనే షూటింగ్ లో పాల్గొన్నాడు.

Shivakumar Ramachandravarapu Effected with Accident and went to Coma says about his emotional journey
Shivakumar Ramachandravarapu : మన సెలబ్రిటీలు సినిమాల కోసం చాలా కష్టపడతారని తెలిసిందే. ఎవరికైనా గాయాలు, ఎలాంటి ఇంజ్యురీలు అయినా కష్టపడి రికవరీ అయి మళ్ళీ సినిమాల్లోకి వస్తారు. ఇటీవల సాయి దుర్గ తేజ్ కూడా రోడ్డు ప్రమాదానికి గురయి చావుబతుకుల మధ్య పోరాడి కోలుకొని మరింత స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇచ్చాడు. అలాగే మరో నటుడు కూడా యాక్సిడెంట్ కి గురయి కోమాలో ఉండి లేచి వచ్చి మళ్ళీ వెంటనే షూటింగ్ లో పాల్గొన్నాడు.
షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చాడు శివ కుమార్ రామచంద్రవరపు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, అనేక రకాల రోల్స్ లోవరుస సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు శివ. ఇప్పుడు హీరోగా నరుడి బ్రతుకు నటన సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 25 రిలీజ్ కాబోతుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు శివ. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ తనకి జరిగిన యాక్సిడెంట్ గురించి మాట్లాడాడు.
Also Read : Prasanth Neel – Sri Murali : ప్రశాంత్ నీల్ బావ.. కన్నడలో స్టార్ హీరో.. ఇప్పుడు తెలుగులో ఎంట్రీ..
శివ మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం మాదాపూర్ వద్ద నాకు యాక్సిడెంట్ అయింది. రాత్రి పూట స్కూటీ మీద వెళ్తుంటే కార్ గుద్దింది. కిందపడిపోవడంతో రైట్ సైడ్ తలకు భారీ గాయం అయింది. హాస్పిటల్ లో చేర్పిస్తే 13 రోజులు కోమాలో ఉన్నాను. దానికి కొన్ని రోజుల ముందే ఈ సినిమా షూటింగ్ ఫిక్స్ అయింది. కేరళలో షూటింగ్ కి టికెట్స్ బుకింగ్, అన్ని అరేంజ్మెంట్స్ అయ్యాయి. నాకు అలా యాక్సిడెంట్ అవ్వడంతో మా టీమ్ ఏం చేయాలో అర్ధం కానీ పరిస్థితిలో ఉన్నారు. షూటింగ్ ఆగిపోయింది. నేను కోమా నుంచి బయటకి వచ్చాక కనీసం ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు డాక్టర్. నీళ్ళల్లో అస్సలు దిగకూడదు, తలని ఎక్కువగా ఊపకూడదు అన్నారు. కానీ హాస్పిటల్ నుంచి యాక్సిడెంట్ అయిన 17వ రోజు డిశ్చార్జ్ అయ్యాను. 18వ రోజు షూట్ కి వెళ్ళిపోయాను. మెడిసిన్స్ వాడుతూ షూట్ చేశాను. డాక్టర్ చెప్పినవి ఏమి పట్టించుకోకుండా తలతో ఫైట్స్ చేశాను, నీళ్ళల్లో మునిగాను. ప్రతి రోజు షూట్ అయ్యేదాకా బతికితే చాలు అనుకున్నాను. షూట్ అయింది, నేను తర్వాత పూర్తిగా కోలుకున్నాను అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు.
యాక్సిడెంట్ అయి కోమాలోకి వెళ్లి వచ్చిన తర్వాత కూడా రెస్ట్ తీసుకోకుండా సినిమా కోసం ఇంత కష్టపడ్డాడు అని తెలిసి శివని అభినందిస్తున్నారు. ఇక నరుడి బ్రతుకు నటన జీవితం విలువ చెప్పే ఓ మంచి సినిమా అని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే పలు నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు అందుకున్న ఈ సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులని ఎలా మెప్పిస్తుందో చూడాలి.