సైనా బ‌యోపిక్ నుంచి శ్ర‌ద్ధా క‌పూర్ డ్రాప్ ఔట్

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్.. సైనా నెహ్వాల్ బయోపిక్ నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

  • Published By: veegamteam ,Published On : March 15, 2019 / 10:58 AM IST
సైనా బ‌యోపిక్ నుంచి శ్ర‌ద్ధా క‌పూర్ డ్రాప్ ఔట్

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్.. సైనా నెహ్వాల్ బయోపిక్ నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్.. సైనా నెహ్వాల్ బయోపిక్ నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సైనా పాత్ర కోసం శ్రద్ధాని తీసుకున్నారు. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ నుండి ఈ మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది.
Read Also: ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి 14 సంవ‌త్స‌రాలు..అనుష్క

ఆ మధ్య సైనా పాత్ర‌లో ఒదిగిపోయిన శ్ర‌ద్ధా లుక్ కూడా విడుద‌ల చేసింది చిత్ర బృందం. పాత్ర కోసం ఆమె పుల్లెల గోపీచంద్ దగ్గర నెల రోజుల పాటు బాడ్మింటన్ లో శిక్షణ కూడా తీసుకుంది. కానీ ఇప్పుడు సడెన్ గా శ్రద్ధాకి డెంగీ ఫీవర్ వచ్చిందని, అందుకే ఆమెని సినిమా నుంచి తప్పించినట్లు నిర్మాణ సంస్థ టీ సిరీస్ తెలిపింది. దీంతో ఆమె సెప్టెంబర్ 27 నుంచి షూటింగ్‌లో పాల్గొన‌డం లేదు. కాని సినిమాని 2020లో ఎలా అయిన విడుద‌ల చేయాల‌ని చిత్రబృందం భావిస్తోంది.

ఈ క్రమంలో శ్ర‌ద్ధా క‌పూర్ స్థానంలో ప‌రిణితీ చోప్రాని ఎంపిక చేసి షూటింగ్‌ని పూర్తి చేయ‌నున్నార‌ట‌. ఈ ఏడాది చివ‌రిలోగా ఎలా అయినా షూటింగ్ పూర్తి చేయాల‌ని అనుకున్నాం. 2020లో సినిమా రిలీజ్ చేయ‌నున్నాం. అందుకే శ్ర‌ద్ధా స్థానంలో ప‌రిణితీని ఎంపిక చేసామ‌ని నిర్మాత భూష‌ణ్ కుమార్ తెలిపారు. అతి త్వ‌ర‌లోనే ప‌రిణితి టీంతో క‌ల‌వ‌నుంద‌ని అంటున్నారు. కాగా, సైనా కామ‌న్వెల్త్ గేమ్స్‌లో రెండు బంగారు ప‌తకాలు సాధించిన తొలి భార‌తీయ బ్యాడ్మింట‌న్‌ క్రీడాకారిణిగా నిలిచిన సంగ‌తి తెలిసిందే.
Read Also: మ‌జిలి మూడో సాంగ్ ‘నా గుండెల్లో’ విడుదల