Shravani Reddy : ‘లెనిన్’ లో హీరోయిన్ అక్క పాత్రలో మెప్పించిన ఈ నటి ఎవరో తెలుసా? ఆల్రెడీ హీరోయిన్ గా చేసి..
లెనిన్ సినిమాతో పాటు వైదేహి పాత్ర చేసిన నటి కూడా బాగా గుర్తింపు తెచ్చుకుంటుంది.

'లెనిన్' లో హీరోయిన్ అక్క పాత్రలో మెప్పించిన ఈ నటి ఎవరో తెలుసా? ఆల్రెడీ హీరోయిన్ గా చేసి..

అక్కినేని అఖిల్ తాజాగా లెనిన్ సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. ఈ సినిమాలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో హీరోయిన్ భాగ్యశ్రీ అక్క వైదేహి పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాని కీలక మలుపు తిప్పే ట్విస్ట్ వైదేహిదే.

వైదేహి పాత్రతో రెండు ట్విస్ట్ లు ఉంటాయి. ఆ ట్విస్ట్ లు అసలు ఊహించలేరు ప్రేక్షకులు. దీంతో ఈ సినిమాతో పాటు వైదేహి పాత్ర చేసిన నటి కూడా బాగా గుర్తింపు తెచ్చుకుంటుంది.

హీరోయిన్ అక్క వైదేహి పాత్రలో నటించిన నటి పేరు శ్రావణి. ఆమె పూర్తిపేరు శ్రావణి కృష్ణవేణి రెడ్డి గుంతబిల్లు. ఈమె తెలుగమ్మాయే.

సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన శ్రావణి ఓ పక్క జాబ్ చేస్తూనే మరో పక్క సినిమా అవకాశాలు ట్రై చేసింది.

లవ్ రెడ్డి అనే సినిమాలో హీరోయిన్ గా నటించి తన నటనతో మెప్పించింది. ఆ సినిమాలో ఎమోషనల్ పాత్రలో చాలా బాగా యాక్ట్ చేసింది.

ఇప్పుడు లెనిన్ సినిమాలో భాగ్యశ్రీ అక్క పాత్రలో బాగా నటించి మెప్పించింది.

కిరణ్ అబ్బవరం చేస్తున్న గువ్వల చెరువు ఘాట్ వెబ్ సిరీస్ లో కూడా కీలక పాత్రలో నటిస్తుంది.

లెనిన్ సినిమా తర్వాత హీరోయిన్ గా ఏమో కానీ అక్క, చెల్లి పాత్రలకు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయితే మంచి అవకాశాలే వస్తాయి ఈ తెలుగమ్మాయికి.

లెనిన్ సినిమాకు సంబంధించిన పలు వర్కింగ్ స్టిల్స్ కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రావణి.
