Shruti Haasan: ప్రభాస్ డిన్నర్‌కు ఫ్లాటైపోయిన శృతి!

మన రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగానే కాదు.. మర్యాదలతో కూడా మనసులు దోచేస్తున్నాడు. ప్రభాస్‌ చేసే అతిధి మర్యాదలు ఓ రేంజ్‌లో ఉంటాయని ఇప్పటికే చాలామంది చెప్తుంటే విన్నాం. షూటింగ్ సెట్‌లో ప్రభాస్‌ ఉంటే చాలు ఇక యూనిట్‌ సభ్యులందరికీ పండుగేనట. వెరైటీ వంట‌లతో రోజూ చేసే అతిధి మర్యాదలకు ఎవరైనా ఫ్లాట్ అయిపోవాల్సిందే అంటారు.

Shruti Haasan: ప్రభాస్ డిన్నర్‌కు ఫ్లాటైపోయిన శృతి!

Shruti Haasan

Updated On : August 9, 2021 / 11:42 AM IST

Shruti Haasan: మన రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగానే కాదు.. మర్యాదలతో కూడా మనసులు దోచేస్తున్నాడు. ప్రభాస్‌ చేసే అతిధి మర్యాదలు ఓ రేంజ్‌లో ఉంటాయని ఇప్పటికే చాలామంది చెప్తుంటే విన్నాం. షూటింగ్ సెట్‌లో ప్రభాస్‌ ఉంటే చాలు ఇక యూనిట్‌ సభ్యులందరికీ పండుగేనట. వెరైటీ వంట‌లతో రోజూ చేసే అతిధి మర్యాదలకు ఎవరైనా ఫ్లాట్ అయిపోవాల్సిందే అంటారు. ఆ మధ్య సాహో చిత్రీకరణ సమయంలో శ్ర‌ద్ధా క‌పూర్‌కు ప్రత్యేకంగా వంటలు చేయించిన ప్రభాస్‌.. ఈ మధ్య రాధేశ్యామ్ షూట్ లో కూడా భారీ డిన్నర్ ఆరెంజ్ చేశాడట.

ప్రభాస్ చేసిన అతిధి మర్యాదలకు కృతి సనన్ ఫిదా అయిపోవడమే కాదు.. సెట్ లో అందరి తిండి వివరాలపై ప్రభాస్ ఓ కన్నేసి ఉంటాడని చెప్పుకొచ్చింది. నదియా కూడా ప్రభాస్ విందు గురించి పొగడడం విన్నాం. ఇక ఇప్పుడు సలార్‌ బ్యూటీ శ్రుతిహాసన్‌ కోసం దాదాపు 20 వెరైటీ వంటకాలతో సర్‌ప్రైజ్‌ ఇచ్చాడట. ప్రస్తుతం సలార్‌ మూవీ చిత్రీకరణ హైదరాబాద్ లోనే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభాస్ శృతి కోసం ఓ విందు ఏర్పాటు చేశాడట. ఈ విందులో ప్రభాస్ చేయించిన ఆ రుచులకు శృతి ఫ్లాట్ అయిపొయింది. సో…. హ్యాపీ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఆ వెరైటీలను చూపిస్తూ నోరూరించేసింది.

ప్రభాస్ శృతి కోసం ఏర్పాటు చేసిన ఈ డిన్నర్ మెనులో పురాతన వంటకాలు, అరబిక్ స్టైల్ మాంసం, గోంగూర మాంసం, బిరియానీ, దుబాయ్ స్టైల్ మండి బిర్యానీ, చికెన్, మటన్, పీతలు, రోయ్యల పులుసు, మటన్ కర్రీల్లో రకాలు అన్నీ ఉన్నాయి. అలాగే కొన్ని రకాల వెజ్ ఐటమ్స్ కూడా ఉండగా ఇన్నిరకాలు ఎప్పుడూ రుచి చూడలేదన్న శృతి.. అత్యంత పురాతన వంటకాలు తినే పురాతన మానవుడని ప్రభాస్ ని అభివర్ణించింది. ప్రభాస్ తనపై చూపించిన ఈ ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేనని శ్రుతి రెబల్ స్టార్ ను ఆకాశానికి ఎత్తేసింది.