Shruti Haasan : సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకున్నా?

శృతి హాసన్ నటిగానే చాలామందికి పరిచయం.. అయితే ఆమె పాటలు కూడా పాడుతుంది.. అంతేకాదు మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తుంది.

Shruti Haasan : సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకున్నా?

Shruti Haasan

Updated On : August 16, 2021 / 8:49 AM IST

Shruti Haasan : శృతిహాసన్ నటి కాకముందు గాయనిగా మంచి పేరుసంపాదించారు. సంగీతంలో చక్కటి ప్రావిణ్యం కనబరిచారు. సంగీతంపై ఉన్న మక్కువ ఆమెను సినీమా వైపు అడుగులు వేసేలా చేసింది. తండ్రి కమల్ అప్పటికే ఇండస్ట్రీలో ఉండటంతో ఆమెకు అవకాశాల కోసం వెతకాల్సిన అవసరం రాలేదు. కమల్ హాసన్ కూతురు అంటే అవకాశాలు ఇవ్వని వారు ఎవరుంటారు. అయితే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆమె తన ఓన్ టాలెంట్ తో పైకి వచ్చారు.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో శృతి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. కాలేజీ రోజుల్లో రాక్‌స్టార్‌ కావాలని కలలుకనేదాన్ని. సొంతంగా రాక్‌బ్యాండ్‌ ఏర్పాటు చేయాలనుకున్నా. అందుకు డబ్బులు బాగా అవసరం. అందుకే సినిమాల్లోకి వచ్చాను. రెండుమూడు సినిమాల ద్వారా డబ్బు సంపాదించి ఆ తర్వాత చిత్రసీమకు గుడ్‌బై చెబుదామనుకున్నా. అయితే విధి మరోలా తలచింది. ఇక్కడకు వచ్చిన తర్వాత క్రమంగా సినిమాల్ని ప్రేమించడం మొదలుపెట్టా.

ఓరకంగా సినీరంగం నాకు అరెంజ్డ్‌ మ్యారేజ్‌లాంటిది. మెల్లగా సినిమా ప్రేమలో పడ్డా అని శృతిహాసన్‌ చెప్పింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. విరామ సమయాన్ని సంగీతం కోసం వినియోగిస్తునని ఆమె తెలిపారు. ఇక ప్రస్తుతం శృతిహాసన్‌ తెలుగలో ప్రభాస్‌ సరసన ‘సలార్‌’ చిత్రంలో నటిస్తోంది.