అత్యాచారం చేస్తానంటూ బెదిరించాడు.. అరెస్ట్ అయ్యాడు..

స్టాండప్ లేడీ కమెడియన్ అగ్రిమా జోషువాను అత్యాచారం చేస్తానంటూ ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డ యూ ట్యూబర్ శుభమ్ మిశ్రాను గుజరాత్‌లో వడోదర పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచార బెదిరింపుల కేసును సుమోటో కేసుగా తీసుకుని పోలీసులు అతనిపై ఎఫైఆర్ నమోదు చేశారు.
2019లో జరిగిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్రలో ఆవిష్కృతం కానున్న ఛత్రపతి శివాజీ విగ్రహంపై అగ్రిమా జోషువా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అగ్రిమాపై సదరు యూ ట్యూబర్ బెదిరింపులకు పాల్పడ్డాడు..
నీపై అత్యాచారం చేస్తానని వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు. దీంతో అగ్రిమా జోషువా అతనిపై ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన సైబర్ క్రైమ్ పోలీసులు శుభమ్ మిశ్రాను కటకటాల్లోకి నెట్టారు.
Read Here>>సల్లూభాయ్.. జై జవాన్.. జై కిసాన్..