విబేధాలొచ్చాయి.. విడిపోతున్నాం : శ్వేతా బసు
పెళ్లై ఏడాది కాకుండానే శ్వేతా బసు ప్రసాద్ తన భర్త రోహిత్ మిట్టల్ నుండి విడిపోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు..

పెళ్లై ఏడాది కాకుండానే శ్వేతా బసు ప్రసాద్ తన భర్త రోహిత్ మిట్టల్ నుండి విడిపోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు..
‘ఎకడా’.. అంటూ తన ముద్దు ముద్దు మాటలతో తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని తర్వాత వివాదాల్లో చిక్కుకుని దాదాపు కనుమరుగైపోయిన శ్వేతా బసు ప్రసాద్ గతేడాది వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లై ఏడాది కాకుండానే శ్వేతా బసు వైవాహిక జీవితానికి ముగింపు పలికింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె అభిమానులతో పంచుకుంది.
2018 డిసెంబర్ 13న శ్వేతా, రోహిత్‌ల వివాహం పుణెలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడకకు కుటుంబ సభ్యులతోపాటు, పలువురు సన్నిహితులు హాజరయ్యారు. రోహిత్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నప్పుడు శ్వేతకు పరిచయమవడం, తర్వాత ప్రేమ, పెళ్లి వయా విడాకుల వరకు దారి తీసింది.
‘రోహిత్ మిట్టల్, నేను మా వివాహ బంధానికి ముగింపు పలకాలనే నిర్ణయానికి వచ్చాం. కొన్ని నెలలుగా మా మధ్య విబేధాలు చోటుచేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంతకుముందు మా ప్రయాణం చాలా సంతోషంగా సాగింది. ఒక పుస్తకాన్ని మొదటి నుంచి చివరి వరకు చదవనంత మాత్రాన.. అది చెడ్డదని కాదు. అలాగే కొన్ని విషయాలు అసంపూర్ణంగానే ఉండటం బాగుంటుంది. నేను మరిచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చినందుకు, ఎల్లప్పుడూ నాకు స్ఫూర్తిగా నిలించినందుకు థ్యాంక్యూ రోహిత్’ అని శ్వేతా ఎమోషనల్ పోస్ట్ చేసింది.