మళ్లీ ప్రేమలో పడతా.. విడాకులపై స్పందించిన శ్వేతాబసు

విడాకుల వ్యవహారంపై స్పందించిన ‘కొత్త బంగారు లోకం’ బ్యూటీ శ్వేతాబసు ప్రసాద్..

  • Published By: sekhar ,Published On : January 22, 2020 / 06:09 AM IST
మళ్లీ ప్రేమలో పడతా.. విడాకులపై స్పందించిన శ్వేతాబసు

Updated On : January 22, 2020 / 6:09 AM IST

విడాకుల వ్యవహారంపై స్పందించిన ‘కొత్త బంగారు లోకం’ బ్యూటీ శ్వేతాబసు ప్రసాద్..

‘కొత్త బంగారు లోకం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని తర్వాత వివాదాల్లో చిక్కుకుని దాదాపు కనుమరుగైపోయిన శ్వేతా బసు ప్రసాద్ గతేడాది వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లై ఏడాది కాకుండానే శ్వేతా బసు వైవాహిక జీవితానికి ముగింపు పలికింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె అభిమానులతో పంచుకుంది.

Image result for shweta basu prasad divorce

2018 డిసెంబర్ 13న శ్వేతా, రోహిత్ పూణెలో వివాహం చేసుకున్నారు. రోహిత్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నప్పుడు శ్వేతకు పరిచయమవడం, తర్వాత ప్రేమ, పెళ్లి వయా విడాకుల వరకు దారి తీసింది. తాజాగా తమ విడాకుల వ్యవహారంపై శ్వేత స్పందించింది.

Read Also : రోజుకి రూ.250 ఇచ్చేవారు – ఫెయిల్యూర్స్‌ను ఎంజాయ్ చేస్తాను : నేషనల్ అవార్డ్ విన్నర్ బాబీ సింహా

Image result for shweta basu prasad divorce

‘‘మేమిద్దరం చట్ట పరంగా విడాకులకు దరఖాస్తు చేసుకున్నాం.. ఇక్కడ ఓ విషయం చెప్పాలి.. మేం భార్యాభర్తల కంటే ముందు మంచి ఫ్రెండ్స్.. రోహిత్ టాలెంట్ గలవాడు.. తనో అద్భుతమైన దర్శకుడు.. ఎప్పటికైనా మేం కలిసి పనిచేస్తామని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.. మళ్లీ ఇంకోసారి ప్రేమలో పడను అని చెప్పలేను కానీ ప్రస్తుతానికి ప్రేమ గురించి ఎటువంటి ఆలోచనలు లేవు. ఇప్పుడు నా దృష్టి అంతా కెరీర్ మీదే ఉంది’’ అని చెప్పుకొచ్చింది శ్వేతబసు.
Image