Siddharth – Aditi : సిద్దార్థ్ , అదితి ఈ ఫొటోతో రిలేషన్‌షిప్ పై క్లారిటీ ఇచ్చారా?.. రెండో పెళ్లి చేసుకోబోతున్నారా?

తాజాగా న్యూ ఇయర్ కి విదేశాల్లో ఇద్దరూ కలిసి క్లోజ్ గా దిగిన ఓ ఫోటో షేర్ చేసి విషెష్ చెప్పారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.

Siddharth – Aditi : సిద్దార్థ్ , అదితి ఈ ఫొటోతో రిలేషన్‌షిప్ పై క్లారిటీ ఇచ్చారా?.. రెండో పెళ్లి చేసుకోబోతున్నారా?

Siddharth Aditi Rao Hydari goes viral again with New Year Special Photo

Updated On : January 2, 2024 / 8:41 AM IST

Siddharth – Aditi : హీరో సిద్దార్థ్(Siddharth), హీరోయిన్ అదితిరావు హైదరి(Aditi Rao Hydari) గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు, డేటింగ్ లో ఉన్నారు అని వార్తలు వస్తూనే ఉన్నాయి. ముంబై(Mumbai) వీధుల్లో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు, కలిసి డిన్నర్స్, లంచ్, పార్టీలకు వెళ్తూనే ఉన్నారు. సినిమా ఈవెంట్స్ కి కలిసే వెళ్తున్నారు. కలిసి రీల్స్ కూడా చేస్తున్నారు. సిద్దార్థ్ అయితే అదితి వాళ్ళ చుట్టాలింటికి కూడా వెళ్ళాడు.

ఇక అందరికి తెలిసిపోయిందేమో అని ఈ మధ్య ఇద్దరూ కలిసి ఓపెన్ గానే తిరిగేస్తున్నారు. ఇటీవల సిద్దార్థ చిన్నా సినిమా బాలీవుడ్ ప్రీమియర్ కి అదితి దగ్గరుండి అన్ని చూసుకుంది. పుట్టిన రోజులకు ఒకరికొకరు తమ సోషల్ మీడియాలో స్పెషల్ విషెష్ చెప్తున్నారు. సిద్దార్థ్ – అదితి చెప్పకపోయినా వీరు రిలేషన్ లో ఉన్నారని అందరూ క్లారిటీతో ఉన్నారు.

తాజాగా న్యూ ఇయర్ కి విదేశాల్లో ఇద్దరూ కలిసి క్లోజ్ గా దిగిన ఓ ఫోటో షేర్ చేసి విషెష్ చెప్పారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇలా ఇద్దరూ కలిసి ఫోటో పోస్ట్ చేయడంతో అధికారికంగా వీరి రిలేషన్ ని ప్రకటించారా? త్వరలో పెళ్లి చేసుకుంటున్నారా? అంటూ పలువురు ఆ ఫోటో కింద కామెట్స్ చేస్తున్నారు. అందరికి వీరి రిలేషన్ అర్థమైనా, వీరు మాత్రం బయటకి చెప్పకుండా హ్యాపీగా కలిసి తిరిగేస్తున్నారు.

Also Read : RGV : ఆ అమ్మాయితో న్యూ ఇయర్ పార్టీలో రచ్చ చేసిన ఆర్జీవీ.. ఆ ఆర్జీవీ భామ ఎవరు?

అయితే వీళ్ళు పెళ్లి చేసుకుంటారా? లేదు ఇలా డేటింగ్ లోనే ఉంటారా అని కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు పలువురు. ఒకవేళ సిద్దార్థ్ – అదితి పెళ్లి చేసుకుంటే వీరిద్దరికి ఇది రెండో పెళ్లి అవుతుంది. గతంలో సిద్దార్థ్ మేఘన నారాయణన్ అనే అమ్మాయిని వివాహం చేసుకోగా ఆ తర్వాత విడాకులు అయ్యాయి. అదితి కూడా సత్యదేవ్ మిశ్రా అనే నటుడ్ని పెళ్లి చేసుకొని ఆ తర్వాత కొన్నాళ్ళకు విడాకులు తీసుకుంది. గతంలో సిద్దార్థ్ – అదితికి పరిచయం ఉన్నా మహా సముద్రం సినిమాలో కలిసి నటించడంతో అప్పట్నుంచి బాగా క్లోజ్ అయ్యారని అంతా భావిస్తున్నారు. మరి శుభవార్త ఏమన్నా చెప్తారేమో చూడాలి.