RGV : ఆ అమ్మాయితో న్యూ ఇయర్ పార్టీలో రచ్చ చేసిన ఆర్జీవీ.. ఆ ఆర్జీవీ భామ ఎవరు?
ఎప్పటిలాగే ఓ అమ్మాయితో బాగా రచ్చ చేస్తూ న్యూ ఇయర్ పార్టీలో ఎంజాయ్ చేశాడు ఆర్జీవీ. దీంతో ఆ అమ్మాయి కూడా వైరల్ అయిపోయింది.

RGV Enjoying New Year Party with siri stazie in Pub she goes Viral
RGV : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ గురించి అందరికి తెలిసిందే. నా ఇష్టం అంటూ ఇష్టం వచ్చిన పనులు చేస్తాడు. ఇక కుదిరినప్పుడల్లా పార్టీల్లో మునిగి తేలుతుంటాడు. ఒక్కోసారి ఒక్కో కొత్త అమ్మాయిని పరిచయం చేసి వాళ్ళని పాపులర్ చేస్తుంటాడు. తాజాగా ఆర్జీవీ తన న్యూ ఇయర్ పార్టీ వేడుకల వీడియోలు, ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఎప్పటిలాగే ఓ అమ్మాయితో బాగా రచ్చ చేస్తూ న్యూ ఇయర్ పార్టీలో ఎంజాయ్ చేశాడు ఆర్జీవీ. దీంతో ఆ అమ్మాయి కూడా వైరల్ అయిపోయింది. ఇది చాలదన్నట్టు ఆ అమ్మాయి వీడియో ఒకటి షేర్ చేసి నాతో పార్టీలో ఎంజాయ్ చేసిన అమ్మాయి ఈమె అని తనని ట్యాగ్ కూడా చేశాడు. ఆమె పేరు సిరి స్టేజి. అసలు పేరు ఇదో కాదో తెలీదు కానీ సోషల్ మీడియాలో కొసరు పేరు మాత్రం ఇదే పెట్టుకుంది ఈ భామ.
Also Read : Jr NTR : జపాన్ భారీ భూకంపం నుంచి జస్ట్ మిస్.. స్పందించిన ఎన్టీఆర్
ఆల్రెడీ ఈ సిరి స్టేజి అనే అమ్మాయి గతంలో ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ అప్పుడే సిరి బాగా పాపులర్ అయింది. ఇప్పుడు మరోసారి ఆర్జీవీతో పార్టీలో కలిసి రచ్చ చేసి పాపులర్ అవుతోంది. ఈ సిరి స్టేజి ఆర్జీవీ ఫ్యాన్ అని గతంలో చెప్పింది. నటిగా అవకాశాలు ట్రై చేస్తుంది. ఓ సినిమాలో నటించిన సిరి ప్రస్తుతం మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తుంది. మరి ఆర్జీవీ పుణ్యమా అని ఈ పాపులారిటీతో అవకాశాలు వస్తాయేమో చూడాలి.