Siddharth – Aditi Rao Hydari : ఏకంగా అమెరికా వెళ్లి.. యాపిల్ ఫోన్ కొని యాపిల్ సీఈఓతో ముచ్చట్లు పెట్టిన సిద్దార్థ్, అదితి..
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ని కలిసి అతనితో కాసేపు ముచ్చటించారు సిద్దార్థ్, అదితి.

Siddharth and Aditi Rao Hydari Meets Apple CEO Tim Cook at Apple event in California
Siddharth – Aditi Rao Hydari : ఖరీదైన ఫోన్స్ లో ఒకటైన యాపిల్ తన కొత్త మోడల్ ని ఇవాళ మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఐఫోన్ 16 సిరీస్‌ను భారత్ సహా ఇతర ప్రపంచ మార్కెట్లలో యాపిల్ కంపెనీ లాంచ్ చేసింది. దీంతో యాపిల్ ప్రేమికులు ఈ కొత్త సిరీస్ ఫోన్స్ కొనుక్కోడానికి ఎగబడుతున్నారు. ఈ క్రమంలో హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి కూడా ఈ కొత్త ఐ ఫోన్ 16ని కొనుక్కున్నారు.
Also Read : Simbu : తెలుగు రాష్ట్రాల వరదలపై స్పందించిన మొదటి తమిళ్ హీరో.. భారీ విరాళం..
హీరో సిద్దార్థ్ – హీరోయిన్ అదితి గత కొన్నేళ్లుగా ప్రేమించుకొని ఇటీవలే నిశ్చితార్థం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా ఈ జంట అమెరికా లోని కాలిఫోర్నియాకు వెళ్లి అక్కడ యాపిల్ కంపెనీకి చెందిన స్టీవ్ జాబ్స్ థియేటర్ కి వెళ్లి ఐ ఫోన్ 16ని కొనుగోలు చేసారు. అక్కడ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ని కలిసి అతనితో కాసేపు ముచ్చటించారు.
View this post on Instagram
టిమ్ కుక్ తో దిగిన ఫొటోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేసి.. మర్చిపోలేని, అద్భుతమైన అనుభవం ఇది. టిమ్ కుక్ ఎంతో కూల్ గా మాట్లాడారు. గత రెండు రోజులు మాకు చాలా స్పెషల్. యాపిల్ టీమ్ తో మా చుట్టు క్రియేటివిటీ, టెక్నాలజీతో నిండి ఉన్నాము అని తెలిపారు సిద్దార్థ్, అదితి. అలాగే యాపిల్ సెంటర్ బయట అదితి, సిద్దార్థ్ దిగిన ఫోటోలను షేర్ చేసి ఇద్దరు యాపిల్ ఫ్యాన్స్ మొదటిసారి యాపిల్ ఈవెంట్ కి వచ్చారు అని పోస్ట్ చేసారు. దీంతో సిద్దార్థ్, అదితి యాపిల్ ఐ ఫోన్ కొనుక్కోడానికి అమెరికా వరకు వెళ్లి యాపిల్ ఈవెంట్ లో పాల్గొని సందడి చేసారని జనాలు ఆశ్చర్యపోతున్నారు. వీరు షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.
View this post on Instagram