Siddharth : సిద్దార్థ్, అదితి మరోసారి దొరికిపోయారు.. శర్వానంద్ పెళ్ళికి వెళ్లి అట్నుంచి..
ఇటీవల జూన్ 3న శర్వానంద్ పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. శర్వానంద్, సిద్దార్థ్ మంచి స్నేహితులు. శర్వా నిశ్చితార్థం కు కూడా సిద్దార్థ్, అదితి కలిసి వచ్చారు. ఇప్పుడు పెళ్ళికి కూడా కలిసి వెళ్లారు.

Siddharth and Aditi Rao Hydari went to Aditi Relatives home in jaipur after Sharwanand Marriage
Aditi Rao Hydari : హీరో సిద్దార్థ్(Siddharth), హీరోయిన్ అదితిరావు హైదరి(Aditi Rao Hydari) గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు, డేటింగ్ లో ఉన్నారు అని వార్తలు వస్తూనే ఉన్నాయి. ముంబై(Mumbai) వీధుల్లో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు, కలిసి డిన్నర్స్, లంచ్, పార్టీలకు వెళ్తూనే ఉన్నారు. శర్వానంద్(Sharwanand) నిశ్చితార్థానికి కూడా కలిసే వచ్చారు ఈ జంట. ఇలా ఎక్కడికి వెళ్లినా కలిసి రెగ్యులర్ గా కనిపిస్తుండటంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా అని అంతా అనుకుంటున్నారు.
దీని గురించి అడిగితే మాత్రం ఇద్దరూ స్పందించట్లేదు. మహా సముద్రం(Maha Samudram) సినిమాలో అదితి, సిద్దార్థ్ కలిసి నటించారు. అంతకుముందు నుంచే వీరికి పరిచయం ఉన్నా ఈ సినిమా తర్వాత క్లోజ్ గా మారారు. తాజాగా మరోసారి సిద్దార్థ్ – అదితి కలిసి కనిపించారు. అంతేకాక ఇద్దరూ కలిసి అదితి వాళ్ళ చుట్టాలింటికి కూడా వెళ్లారు. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇటీవల జూన్ 3న శర్వానంద్ పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. శర్వానంద్, సిద్దార్థ్ మంచి స్నేహితులు. శర్వా నిశ్చితార్థం కు కూడా సిద్దార్థ్, అదితి కలిసి వచ్చారు. ఇప్పుడు పెళ్ళికి కూడా కలిసి వెళ్లారు. సిద్దార్థ్ పెళ్లిలో వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు మాత్రం బయటకు రాలేదు. ఇద్దరు ముంబై నుంచి జైపూర్ లో పెళ్ళికి వెళ్లి, శర్వానంద్ పెళ్ళిలో ఎంజాయ్ చేసి అనంతరం జైపూర్ దగ్గర వేరే ఊర్లో ఉంటున్న అదితి చుట్టాలింటికి వెళ్లారు. ఒకప్పటి నటి, ప్రముఖ రాజకీయ నాయకురాలు బినా కక్ ఇంటికి వెళ్లారు.
బినా స్వయంగా అదితి, సిద్ధార్థ్ లతో కలిసి ప్రేమగా దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ ఫొటోలతో అదితి సిద్దార్థ్ ని తన ఫ్యామిలీకి కూడా పరిచయం చేసిందని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారేమో అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి ఈ ఫొటోలతో వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారని క్లారిటీ ఇచ్చేసినట్టే అంటున్నారు.
#aditiraohydari & #siddharthsuryanarayan spotted at Mumbai Airport 😍💖📸@aditiraohydari @viralbhayani77 pic.twitter.com/fH2L9t7fEj
— Viral Bhayani (@viralbhayani77) June 2, 2023