Siddhu Jonnalagadda : అయ్యప్ప మాలలో డీజే టిల్లు.. కొత్త సినిమా ఓపెనింగ్‌లో వైరల్ అవుతున్న ఫొటోలు..

తెలుసు కదా సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో సిద్ధూ జొన్నలగడ్డ అయ్యప్ప మాలలో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

Siddhu Jonnalagadda : అయ్యప్ప మాలలో డీజే టిల్లు.. కొత్త సినిమా ఓపెనింగ్‌లో వైరల్ అవుతున్న ఫొటోలు..

Siddhu Jonnalagadda Appears in Ayyappa Mala at his New Movie Opening Telusu Kada

Siddhu Jonallagadda : డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) త్వరలో దీనికి సీక్వెల్ సినిమా టిల్లు స్క్వేర్ తో రాబోతున్నాడు. ఇటీవల ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకత్వంలో మరో కొత్త సినిమా అనౌన్స్ చేసాడు సిద్ధు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో నీరజ కోన దర్శకత్వంలో సిద్ధు హీరోగా, శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty), రాశిఖన్నా(Raashii Khanna) హీరోయిన్స్ గా ‘తెలుసు కదా’(Telusu Kada) అనే ఆసక్తికర టైటిల్ తో సినిమాని ప్రకటించారు.

తాజాగా నేడు ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం జరగగా చిత్రయూనిట్ తో పాటు నాని, నితిన్, ఆది పినిశెట్టి, హరీష్ శంకర్, డైరెక్టర్ బాబీ.. పలువురు సినీ ప్రముఖులు కూడా విచ్చేశారు. అయితే ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో సిద్ధూ జొన్నలగడ్డ అయ్యప్ప మాలలో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మన హీరోల్లో చిరంజీవి, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, రామ్ చరణ్, శర్వానంద్, నాని.. ఇలా చాలా మంది రెగ్యులర్ గా అయ్యప్ప మాల వేస్తూ ఉంటారు.

Also Read : Hi Nanna : నాని ‘హాయ్ నాన్న’ సినిమా.. నాగార్జున సినిమా కథేనా? లేదా తమిళ్ సినిమా కథా?

ఇప్పుడు యువ హీరోలు కూడా ఏదో ఒక మాలలో కనపడి అభిమానులని, ప్రేక్షకులని ఆశ్చర్యపరుస్తున్న. తాజాగా సిద్ధూ జొన్నలగడ్డ ఇలా తన కొత్త సినిమా ఓపెనింగ్ లో అయ్యప్ప మాలలో కనిపించగా ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ఇటీవల హీరో విశ్వక్సేన్ అంజనేయ స్వామి మాలలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇలా బయట ఫుల్ స్పీడ్ గా ఉండే హీరోల్లో ఇలాంటి భక్తి భావం కూడా ఉందా అని ఆశ్చర్యపోతూనే అభినందిస్తున్నారు అభిమానులు, నెటిజన్లు.