Jack Movie Twitter Review : జాక్ మూవీ ట్విట్టర్ రివ్యూ..

హీరో సిద్దు జొన్నలగడ్డ న‌టించిన చిత్రం జాక్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

Jack Movie Twitter Review : జాక్ మూవీ ట్విట్టర్ రివ్యూ..

Siddu Jonnalagadda Jack Movie Twitter Review

Updated On : April 10, 2025 / 11:48 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ న‌టించిన చిత్రం జాక్. బొమ్మరిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ‘బేబీ’ ఫేమ్‌ వైష్ణవి చైతన్య క‌థానాయిక‌గా న‌టించ‌గా శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హ్యారీస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం నేడు (ఏప్రిల్ 10న) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

స్పై యాక్షన్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే చాలా చోట్ల ఫ‌స్ట్‌షోలు పూర్తి అయ్యాయి. దీంతో ఈ చిత్రాన్ని చూసిన కొంద‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అభిప్రాయాన్ని తెలియ‌జేస్తున్నారు. సిధ్ధ్ యాక్టింగ్‌, కామెడీ ఈ చిత్రానికి హైలెట్‌గా నిలిచింద‌ని అంటున్నారు. అలాగే వైష్ణవి చైత‌న్య త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంద‌ని అంటున్నారు.