Silk Smitha Biopic : సిల్క్ స్మిత పుట్టిన రోజు.. మరో బయోపిక్ అనౌన్స్.. ఆమెలా నటించే హీరోయిన్ ఎవరో తెలుసా?
ఆల్రెడీ సిల్క్ స్మిత జీవితంపై బయోపిక్ అంటూ గతంలో విద్యా బాలన్ మెయిన్ లీడ్ లో 'ది డర్టీ పిక్చర్' సినిమా వచ్చి భారీ విజయం సాధించింది.

Silk Smitha Biopic Announced on Her Birth Anniversary
Silk Smitha Biopic : సిల్క్ స్మిత.. ఒకప్పటి అందాల నటి.. సౌత్ ప్రేక్షకులని, ముఖ్యంగా యూత్ ని ఉర్రూతలూగించిన అందాల తార. విజయలక్ష్మిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి సిల్క్ స్మితగా పేరు మారి స్టార్ యాక్ట్రెస్ అయింది. ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగి, అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకొని, స్టార్ లైఫ్ చూసినా చివరి దశలో అనుకోకుండా పరిస్థితులు ఆమెని కృంగదీయడంతో ఆత్మహత్య చేసుకొని మరణించింది.
సిల్క్ స్మిత దూరమైనా ఇప్పటికి అనేకమంది ఆమెని తలచుకుంటారు. ఇప్పటికి సినీ పరిశ్రమలో సిల్క్ స్మిత ఛాయలు కనిపిస్తూనే ఉంటాయి. ఆల్రెడీ సిల్క్ స్మిత జీవితంపై బయోపిక్ అంటూ గతంలో విద్యా బాలన్ మెయిన్ లీడ్ లో ‘ది డర్టీ పిక్చర్’ సినిమా వచ్చి భారీ విజయం సాధించింది. అయితే ఆ సినిమాలో విద్యా సిల్క్ స్మితలాగా కనపడకపోయినా సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించింది. తాజాగా నేడు డిసెంబర్ 2 సిల్క్ స్మిత పుట్టిన రోజు కావడంతో ఆమె జీవిత కథ ఆధారంగా మరో బయోపిక్ అనౌన్స్ చేశారు.
ఇండియన్ ఆస్ట్రేలియన్ నటి చంద్రిక రవి(Chandrika Ravi) సిల్క్ స్మిత పాత్రలో కనిపించనుంది. నేడు ఫస్ట్ లుక్ కూడా రిలిజ్ చేశారు. ‘సిల్క్ స్మిత – ది అన్ టోల్డ్ స్టోరీ’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. చంద్రిక రవి అచ్చం సిల్క్ స్మితలా కనపడేలా మేకప్ చేశారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. చంద్రిక రవి గతంలో పలు తమిళ్ సినిమాల్లో నటించింది. బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేసింది. ఇప్పుడు సిల్క్ స్మితలా కనపడనుంది. ఇక ఈ సినిమాని వచ్చే సంవత్సరం తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. ఇక ఈ సినిమాని జయరాం తెరకెక్కిస్తుంటే స్త్రీ సినిమాస్ నిర్మాణంలో SB విజయ్ నిర్మిస్తున్నారు.
అయితే ఇటీవల మార్క్ ఆంటోనీ సినిమాలో విష్ణు ప్రియ అనే అమ్మాయి అచ్చు సిల్క్ స్మితలా కనపడి మెప్పించింది. బయట కూడా ఆమె అలాగే కనిపిస్తుండటంతో జూనియర్ సిల్క్ గా పాపులర్ అయింది. పలువురు అభిమానులు, నెటిజన్లు సిల్క్ స్మిత బయోపిక్ లో ఆమెని తీసుకుంటే బాగుండును అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.