Silvina Luna : ప్లాస్టిక్ సర్జరీ వికటించడంతో మరణించిన ప్రముఖ నటి..

ప్లాస్టిక్ సర్జరీ(Plastic Surgery)  వికటించడంతో అర్జెంటీనాకు చెందిన ప్రముఖ నటి, మోడల్ సిల్వినా లూనా మరణించింది. సిల్వినా లూనా అర్జెంటీనా టీవీ పరిశ్రమలో నటిగా, యాంకర్ గా పేరు తెచ్చుకుంది.

Silvina Luna : ప్లాస్టిక్ సర్జరీ వికటించడంతో మరణించిన ప్రముఖ నటి..

Silvina Luna Famous Argentine model and actor Passed away due to complications from plastic surgery

Silvina Luna : కొంతమంది మోడల్స్(Models), నటీనటులు(Actors) మరింత అందంగా కనపడాలని శరీరంలోని కొన్ని భాగాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు. అయితే ఈ ప్లాస్టిక్ సర్జరీ కొంతమందికి వికటించి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నటీనటులు తమ అందం కోసం, అందం ఉంటేనే అవకాశాలు వస్తాయనే ఆలోచనతో కొంతమంది ప్లాస్టిక్ సర్జరీ వైపు మొగ్గుచూపుతున్నారు.

తాజాగా ప్లాస్టిక్ సర్జరీ(Plastic Surgery)  వికటించడంతో అర్జెంటీనాకు చెందిన ప్రముఖ నటి, మోడల్ సిల్వినా లూనా మరణించింది. సిల్వినా లూనా అర్జెంటీనా టీవీ పరిశ్రమలో నటిగా, యాంకర్ గా పేరు తెచ్చుకుంది. మోడల్ గా కూడా పలు ఈవెంట్స్ లో పాల్గొంది. సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. అయితే సిల్వినా గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతుంది.

Salaar : ప్రభాస్ అభిమానులకు మళ్ళీ నిరాశే.. సలార్ సినిమా వాయిదా కన్ఫర్మ్..

సిల్వినా ప్రతివారం కిడ్నీలకు డయాలసిస్ చేయించుకునేది. అయితే ఇటీవల ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళింది. ప్లాస్టిక్ సర్జరీ వికటించడంతో అది తన కిడ్నీ ప్రాబ్లమ్ పై మరింత ఎఫెక్ట్ పడి ప్రాణాలు కోల్పోయింది. 43 ఏళ్ళ వయసులో ఆమె మరణించింది. సిల్వినా ఇలా ప్లాస్టిక్ సర్జరీ వికటించి మరణించడంతో అర్జెంటీనా నటులు, ఆమె అభిమానులు షాక్ కు గురయ్యారు. ఆమెకు నివాళులు అర్పిస్తూ అభిమానులు, ప్రముఖులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే సిల్వినా ఆగస్టు 31నే మరణించగా ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)