200 కోట్ల క్లబ్‌లో సింబా
సింబా జనవరి 8 నాటికి సింబా, రూ.200 కోట్ల క్లబ్‌లోకి అడుగు పెడుతున్నట్టు బాలీవుడ్ క్రిటిక్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు.

సింబా జనవరి 8 నాటికి సింబా, రూ.200 కోట్ల క్లబ్‌లోకి అడుగు పెడుతున్నట్టు బాలీవుడ్ క్రిటిక్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన టెంపర్ మూవీ సూపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని బాలీవుడ్‌లో సింబా పేరుతో రీమేక్ చేసాడు, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ రోహిత్ షెట్టి.. చెన్నై ఎక్స్‌ప్రెస్, గోల్‌మాల్, సింగం సిరీస్‌ల తర్వాత, రణ్‌వీర్ సింగ్, సారా అలీఖాన్ జంటగా, టెంపర్‌ను సింబా పేరుతో రీమేక్ చెయ్యగా, డిసెంబర్ 28న రిలీజ్ అయ్యింది. కరణ్ జోహార్ నిర్మించాడు. పోటీగా మరే సినిమా లేకపోవడం, మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా స్క్రిప్ట్‌లో మార్పులు చేసి, అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు రూపొందించడం, రణ్‌వీర్ సూపర్బ్ పెర్ఫార్మన్స్, సారా గ్లామర్ వెరసి, సింబా సూపర్ హిట్ అయ్యింది.
హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తున్న సింబా, ఇప్పుడు మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. లేటెస్ట్‌గా, రూ.200 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అవబోతుంది సింబా. ఈ మేరకు, జనవరి 8 నాటికి సింబా, రూ.200 కోట్ల క్లబ్‌లోకి అడుగు పెడుతున్నట్టు బాలీవుడ్ క్రిటిక్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు. 2018లో పద్మావత్, సంజూ సినిమాల తర్వాత, 200 కోట్ల క్లబ్‌లో చేరుతున్న సినిమా సింబానే కావడం విశేషం.
వాచ్ సింబా ట్రైలర్…