టబు క్యారెక్టర్‌లో సిమ్రాన్..

టబు క్యారెక్టర్‌లో సిమ్రాన్..

Updated On : December 15, 2020 / 7:01 PM IST

Simran to reprise Tabu’s role: ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధిక ఆప్టే నటించగా బాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన ‘అంధాధూన్’ మూవీ తెలుగు, తమిళ్ భాషల్లో రీమేక్ అవుతోంది. నితిన్, తమన్నా, నభా నటేష్ ప్రధాన పాత్రధారులుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది.

ఈ మూవీ తమిళ్ రీమేక్‌లో ‘జీన్స్’ ప్రశాంత్ హీరోగా నటిస్తున్నాడు. ‘తొలిముద్దు’, ‘వినయ విధేయ రామ’ (రామ్ చరణ్ అన్న పాత్ర) సినిమాలతో ప్రశాంత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. కాగా టబు క్యారెక్టర్‌కు సీనియర్ నటి సిమ్రాన్‌ను ఫిక్స్ చేశారు.

జెజె ఫెడ్రిక్ డైరెక్ట్ చేస్తున్నారు. టబు రోల్ చేయడం పెద్ద బాధ్యతతో కూడిన వ్యవహారం.. నా వంతు న్యాయం చేయడానికి సాయశక్తులా ప్రయత్నిస్తాను అని చెప్పారు సిమ్రాన్. త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.