Chekwume : రీల్ లైఫ్ లాగే రియల్ లైఫ్‌లో.. డ్రగ్స్ కేసులో సింగం 2 నటుడు అరెస్ట్..
డ్రగ్స్ కేసులో ‘సింగం 2’ నటుడు.. నైజీరియన్ దేశస్థుడు చాక్‌విమ్ మాల్విన్ అరెస్ట్..

Chekwume
Chekwume: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం.. బాలీవుడ్ టు టాలీవుడ్ వయా శాండల్‌వుడ్ ఇండస్ట్రీల్లో ప్రకంపనలు సృష్టించింది. డ్రగ్స్ కేసులో పెద్ద తలకాయల పేర్లు బయటకి వచ్చాయి. పలువురు అరెస్టయ్యారు కూడా..
Drugs Into India : భారత్ లోకి నిషేధిత డ్రగ్స్ అసలు ఎలా వస్తున్నాయో తెలుసా
రీసెంట్‌గా డ్రగ్స్ కేసుకులో ఓ నైజీరియన్ నటుణ్ణి బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్య ‘సింగం 2’ సినిమాలో డ్రగ్స్ సప్లై చేసే డానీ క్యారెక్టర్ పక్కన అసిస్టెంట్‌గా కనిపించిన నైజీరియన్ నటుడు చాక్‌విమ్ మాల్విన్ ఆఫ్రికా నుంచి అక్రమంగా మత్తు పదార్థాలు అమ్మాడని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 8 లక్షలు విలువ చేసే హ్యాష్ ఆయిల్, ఎండీఎం వంటి మాదకద్రవ్యాలతో పాటు కొంత నగదు, ఓ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
లాక్ డౌన్ టైం లో సినిమా అవకాశాలు రాకపోవడంతో చాక్‌విమ్ డ్రగ్స్ విక్రయించడం స్టార్ట్ చేసాడు. అతణ్ణి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరితో సంబంధాలున్నాయి.. ఎప్పటినుంచి డ్రగ్స్ విక్రయిస్తున్నాడు..? అనే కోణంలో విచారిస్తున్నారు.
Drugs Case : డ్రగ్స్ కేసులో ఎక్సైజ్‌శాఖకు చుక్కలు చూపిస్తున్న నిందితులు