సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సింగర్ కౌసల్య: కారణం ఇదే!

సెలబ్రిటీలు మాములు మనుషులే.. వాళ్లకు కూడా మనసు ఉంటుంది. వాళ్లకు కూడా ప్రైవసీగా ఉండాల్సిన అవసరాలు ఉంటాయి. అయితే సెలెబ్రిటీలకు సోషల్ మీడియా వేధింపులు ఇటీవల ఎక్కువ అవుతున్నాయి. ఏవో చిన్నా చితకా జోక్స్ అయితే ఈజీగా పక్కన పడేస్తారు. కానీ దారుణంగా. అసభ్య పదజాలంతో వేధిస్తుంటే మాత్రం వాళ్లు కూడా ఎన్నిరోజులు అని ఏమి కాదులే అన్నట్లు ఊరుకుంటారు.
లేటెస్ట్‌గా ఓ సింగింగ్ సెలబ్రిటీకి కూడా ఇటువంటి సోషల్ మీడియా వేధింపులు ఎదురయ్యాయి. దీంతో ఆమె పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కక తప్పలేదు. ఆమె ఎవరో కాదు ప్రముఖ సింగర్ కౌసల్య. సెలెబ్రిటీలు ఎన్ని ఫోన్ నెంబర్లు మార్చినా కూడా ఇప్పుడు ఉన్న పరిజ్ఞానంతో వారి నంబర్లను ఈజీగా తెలిసుకుంటారు. కొంతమందికి వారి నెంబర్ దొరికితే సంబరిపడి ఓసారి మాట్లాడి ఆనందపడుతారు. అయితే కొందరు మాత్రం దొరికిందే తడవుగా వేధిస్తూంటారు.
సింగర్ కౌసల్యకు కూడా అలా వేధించేవారు ఎక్కువ అయ్యారు. ఆమెకు అసభ్య పదజాలంతో మెసేజ్‌లు పంపించే ఆకతాయిలు ఒకరు ఇద్దరు కాదు.. వందల్లో చేరారు. ఒకటి బ్లాక్ చేస్తుంటే మరొకటి.. ఇలా విసిగిపోయిన కౌసల్య ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 342 కాంటాక్ట్స్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. ఆమెకు వచ్చే మెసేజ్‌లు అప్పటికి కూడా ఆగకపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేనట్టారు.