Sid Sriram: సిద్ శ్రీరామ్ పాట.. మన హీరోల పాలిట ట్రెండ్ సెట్టర్!

అప్ కమింగ్ హీరోల నుంచి, స్టార్ హీరోల వరకు ఇప్పుడు ఒక గొంతుకు పడిపోయారు. ఆ గొంతులో ఏముందో కాని, ఏ పాట పాడినా లక్షల వ్యూయర్ షిప్ చిటికెలో వచ్చేస్తుంది. అదే పేరున్నహీరోలకి పాడితే..

Sid Sriram

Sid Sriram: అప్ కమింగ్ హీరోల నుంచి, స్టార్ హీరోల వరకు ఇప్పుడు ఒక గొంతుకు పడిపోయారు. ఆ గొంతులో ఏముందో కాని, ఏ పాట పాడినా లక్షల వ్యూయర్ షిప్ చిటికెలో వచ్చేస్తుంది. అదే పేరున్నహీరోలకి పాడితే టాప్ 1 ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. ఆ గొంతు మరెవరిదో కాదు, సిది శ్రీరామ్ ది ఆయన కేవలం సింగరే కాదు, మన హీరోల పాలిట ట్రెండ్ సెట్టర్.

Vishal: మరోసారి విశాల్‌కు గాయాలు.. యాక్షన్ సెంటిమెంట్ కలిసి వచ్చేనా?

సిద్ శ్రీరామ్ పాడితే ఆ సాంగ్ గ్యారెంటీ చార్ట్ బస్టర్ హిట్టే. ఆయన పాడిన పాటలతో స్టార్ లకి క్రేజ్ పెరిగితే, అప్ కమింగ్ హీరోలకు గుర్తింపు వస్తోంది. సిద్ శ్రీరామ్ పాడిన లేటెస్ట్ సాంగ్ కళావతి. సర్కార్ వారి పాట సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ ల కాంబోలో క్లాస్ మెలోడియస్ డ్యూయట్ సాంగ్. ఈ సాంగ్ ఫిబ్రవరి 13న రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ సాంగ్ సోషల్ మీడియాలో టాప్ 1 ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది.

Aha OTT: తమిళంలో కూడా ఆహా.. గ్రాండ్‌గా లాంచింగ్!

పుష్పలో సిద్ శ్రీరామ్ పాడిన శ్రీవల్లి సాంగ్ పాన్ ఇండియా ఆడియన్స్ నే కాదు, పాన్ వరల్డ్ ఆడియన్స్ నూ మెస్మరైజ్ చేసింది. అలాగే మహేశ్ బాబు సాంగ్ కూడా పాపులరయ్యి మహేశ్ బాబు క్రేజ్ పెరగడానికి హెల్ప్ అవుతుందని ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో రాధే శ్యామ్ కోసం సిద్ శ్రీరామ్ పాడిన తారలే తెగిరాలె నేలకే.. సాంగ్ ఇప్పటికే ప్రభాస్ ఫాన్స్ నే కాదు, పాన్ ఇండియా ఆడియన్స్ ను ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్తోంది.

New Heroins: తెలుగు తెరపై కొత్త అందాలు.. స్టార్స్ అయ్యేది ఎవరో?

హీరో సినిమాలో అశోక్ గల్లా, సెహరిలో హర్ష్ కనుమిల్లి లాంటి అప్ కమింగ్ హీరోలకు పాడి వాళ్లను ఆడియన్స్ కు రీచ్ చేయడంలో హెల్ప్ అవుతున్నాడు. ఏ ఆర్ రెహ్మాన్ కడలి సినిమాతో తెలుగులో ఇంట్రడ్యూస్ అయిన సిద్ శ్రీరామ్ సౌత్ ఇండియా ఫిలింస్ లో మెలోడి, ఫీల్ గుడ్ సాంగ్స్ కు మోస్ట్ క్రేజీయెస్ట్ సింగర్ గా ట్రెండ్ సెట్ చేశాడు. ఇక దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలకు తన గాత్రాన్నందించి అదర్ లాంగ్వేజెస్ హీరోస్ ను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేస్తున్నాడు. అడవి శేష్, నాగచైతన్య, ఆది సాయికుమార్, శర్వానంద్ లాంటి మిడిల్ రేంజ్ హీరోలకు పాడి వాళ్ల హ్యూజ్ మార్కెట్ కు యూజ్ అవుతున్నాడు. మాస్, క్లాస్ తేడా లేకుండా ఆల్ కెటగిరీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న క్లాస్ సింగర్, మన హీరోల ట్రెండ్ సెట్టర్ సిద్ శ్రీరామ్.