సునీత వీడియోలో సుమ సందడి మామూలుగా లేదుగా!

సునీత వీడియోలో సుమ సందడి మామూలుగా లేదుగా!

Updated On : January 26, 2021 / 6:28 PM IST

Sunitha Wedding Film Teaser: పాపులర్ టాలీవుడ్ సింగర్ సునీత రెండో వివాహం ఇటీవల రామ్ వీరపనేనితో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాల వారితో పాటు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

Singer Sunitha

ఇప్పటికే ప్రీ వెడ్డింగ్‌, మెహందీ ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోలను షేర్‌ చేసిన సునీత తాజాగా ‘సునీత + రామ్ వెడ్డింగ్ ఫిల్మ్ టీజర్’ పేరుతో తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మరో వీడియో రిలీజ్ చేశారు.

Singer Sunitha

ఈ వీడియోలో పెళ్లి రోజు వాళ్లింట్లో జరిగిన హడావిడి అంతా చూపించారు. సునీతతో పాటు రేణు దేశాయ్, ఆమె కుమార్తె ఆద్య, ప్రముఖ యాంకర్ సుమ, యాంకర్, నటి అనితా చౌదరి కూడా ఉన్నారు.

Singer Sunitha

సునీత తన ఇద్దరి పిల్లలతో ఆడుకోవడం, రింగులు మార్చుకోవడం, మెహందీ, హ‌ల్దీ ఫంక్ష‌న్‌లో జరిగిన సందడి అంతటినీ చూపించారు. సునీత, బంధువులతో కలిసి యాంకర్‌ సుమ, అనితా చౌదరి డ్యాన్స్‌ చేశారు. సునీత పోస్ట్ చేసిన ఈ ‘సునీత + రామ్ వెడ్డింగ్ ఫిల్మ్ టీజర్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.