Singer Sunitha: అరటి తోటలో సింగర్ సునీత.. వీడియో వైరల్
ఈ మధ్య కాలంలో సెలెబ్రెటీలకు వ్యవసాయం ఓ సరదాగా మారిన సంగతి తెలిసిందే. నగర శివారులో వ్యవసాయ భూమి కలిగి ఉండటం ఒక స్టేటస్ గా సెలెబ్రిటీలు బావిస్తున్నారు. పరిశ్రమలో ప్రతి స్టార్ హీరో..

Singer Sunitha
Singer Sunitha: ఈ మధ్య కాలంలో సెలెబ్రెటీలకు వ్యవసాయం ఓ సరదాగా మారిన సంగతి తెలిసిందే. నగర శివారులో వ్యవసాయ భూమి కలిగి ఉండటం ఒక స్టేటస్ గా సెలెబ్రిటీలు బావిస్తున్నారు. పరిశ్రమలో ప్రతి స్టార్ హీరో ఓ ఫార్మ్ కలిగి ఉండగా.. ఆహారంలో పెస్టిసైడ్స్ వాడకం పెరిగిపోయాక.. ఈ ఫార్మ్ హౌస్లలో సొంతంగా ఆర్గానిక్ వ్యవసాయం చేసుకుంటున్నారు. తమ ఫార్మ్ హౌస్ ల్యాండ్స్ లో పళ్ళు, కూరగాయలు క్రిమిసంహారక మందులు వాడకుండా పండించి తినడమనే ట్రెండ్ ఎక్కువైంది.
Siri-Srihan: దీప్తి-షణ్ముఖ్ తెగదెంపులు.. సిరి-శ్రీహన్ కూడా విడిపోతారా?
ప్రముఖ తెలుగు సినీ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం చెప్పనవసరం లేదు. సింగర్ గా తనదైన శైలిలో స్వీట్ వాయిస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీత కొన్ని రోజుల కిందట రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మీడియా పర్సన్, బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనితో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టిన సునీత.. ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరం ఉన్న ఈమె ఈ మధ్య మళ్ళీ స్వింగ్ లోకి వచ్చేశారు.
Bigg Boss OTT Telugu: ఓటీటీ తెలుగు సీజన్ మొదలయ్యేది ఎప్పుడంటే?
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సునీత ఈమధ్య బాగా యాక్టివ్ గా ఉంటుండగా.. ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. జాయ్ ఆఫ్ ఫార్మింగ్ అంటూ ఆమె షేర్ చేసిన ఈ వీడియో ఆమె ఫార్మ్ హౌస్ లో తీశారు. ఆమె తమ ఫార్మ్ హౌస్ లోని అరటి తోటలో పండిన అరటి పండ్లను స్వయంగా చెట్టునుండి కోస్తున్న ఈ వీడియోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా 23 వేలకు పైగా నెటిజెన్స్ ఆ వీడియోను లైక్ చేశారు. కామెంట్స్ కూడా వేలల్లోనే ఉన్నాయి.
View this post on Instagram