Singer Sunitha : వాళ్ళు నా పాటని ఇష్టపడతారా లేదా నా చీరల్ని, నా అందాన్ని ఇష్టపడతారో తెలీదు..

సునీత దీనిపై మాట్లాడుతూ.. ''నేను ఎప్పుడూ ఆలోచించే విషయం కూడా అదే. నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ వాళ్లంతా నా పాటను ఇష్టపడతారా లేదా నా చీరలని చూసి ఇష్టపడతారా లేక నేను అందంగా ఉంటానని ఇష్టపడతారా తెలీదు. ఎక్కడికి వెళ్లినా...................

Singer Sunitha : వాళ్ళు నా పాటని ఇష్టపడతారా లేదా నా చీరల్ని, నా అందాన్ని ఇష్టపడతారో తెలీదు..

Singer Sunitha spoke about her fans

Updated On : September 22, 2022 / 9:19 AM IST

Singer Sunitha :  టాలీవుడ్‌ టాప్ సింగర్స్ లో సునీత ఒకరు. తన అద్భుతమైన గాత్రంతో, ఎన్నో వందల పాటలతో తెలుగు ప్రేక్షకులని మెప్పించింది. గాత్రమే కాక హీరోయిన్స్ కి పోటీ ఇచ్చే తన అందంతో కూడా అలరిస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటూ తన ఫోటోలు, తనకి సంబంధించిన విశేషాలు, పాటలు అన్ని షేర్ చేసుకుంటుంది. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అలరిస్తున్న సునీతకి ఫ్యాన్స్ కూడా ఎక్కువే ఉన్నారు. సోషల్ మీడియాలో తనకి ఫ్యాన్ పేజీలు కూడా చాలానే ఉన్నాయి.

సునీత గతేడాది ప్రముఖ వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది. చాలా రోజుల తర్వాత సునీత తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలిపింది. ఇంటర్వ్యూలో యాంకర్ మీకు ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంటుంది. హీరోయిన్స్ కంటే మీకే ఫ్యాన్స్ ఎక్కువ అని అంటుంటారు అది ఎంతవరకు నిజం, దానిపై మీరేమంటారు అని అడిగారు.

సునీత దీనిపై మాట్లాడుతూ.. ”నేను ఎప్పుడూ ఆలోచించే విషయం కూడా అదే. నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ వాళ్లంతా నా పాటను ఇష్టపడతారా లేదా నా చీరలని చూసి ఇష్టపడతారా లేక నేను అందంగా ఉంటానని ఇష్టపడతారా తెలీదు. ఎక్కడికి వెళ్లినా మేడం మీ పాటలు చాలా బాగుంటాయి అంటారు. అది నాకు సంతోషాన్నిస్తుంది. ఒక సారి ఓ ఈవెంట్‌ కి వెళ్తే అక్కడ ఓ వ్యక్తి నన్ను చూసి పరుగెత్తుకుంటూ వచ్చాడు. బౌన్సర్స్‌ అతన్ని ఆపినా నా దగ్గరికి రావడానికి ప్రయతిస్తుండటంతో నేను రమ్మన్నాను. అతను నా దగ్గరికి వచ్చి తన ఫోన్లో నా ఫొటో ఒకటి చూపించి మేడం ఈ చీర ఎక్కడ కొన్నారు. ఈ చీర చాలా బాగుంది. ఇలాంటిది మా ఆవిడకి గిఫ్ట్‌గా ఇద్దామనుకుంటున్నాను అని చెప్పాడు. అతను చెప్పినదానికి నేను ఆశ్చర్యపోయాను” అని తెలిపారు.

Anchor lasya : రెండోసారి తల్లి కాబోతున్న యాంకర్ లాస్య..

”కొంతమంది నన్ను ఎలా ఇష్టపడినా నా పాటల్ని, నా కళని, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నా గాత్రాన్ని ఇష్టపడి నన్ను అభిమానించేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒక సింగర్ గా నన్ను అభిమానించేవాళ్ళు ఉన్నందుకు భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంటాను” అని సునీత చెప్పింది.