ఈరోజు సింగిల్ యాంథెమ్ – రేపు నిశ్చితార్థం

యంగ్ హీరో నితిన్, రష్మిక జంటగా నటిస్తున్న ‘భీష్మ’ (సింగిల్ ఫరెవర్).. నుండి ‘సింగిల్ యాంథెమ్’ వీడియో సాంగ్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : February 14, 2020 / 08:04 AM IST
ఈరోజు సింగిల్ యాంథెమ్ – రేపు నిశ్చితార్థం

Updated On : February 14, 2020 / 8:04 AM IST

యంగ్ హీరో నితిన్, రష్మిక జంటగా నటిస్తున్న ‘భీష్మ’ (సింగిల్ ఫరెవర్).. నుండి ‘సింగిల్ యాంథెమ్’ వీడియో సాంగ్ రిలీజ్..

యంగ్ హీరో నితిన్, వరుస విజయాలతో మంచి జోరుమీదున్న కన్నడ చిన్నది రష్మిక జంటగా.. ‘ఛలో’ మూవీతో ఆకట్టుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో.. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న బ్యూటిఫుల్ లవ్ స్టోరి ‘భీష్మ’ (సింగిల్ ఫరెవర్)..

ఇటీవల విడుదల చేసిన టీజర్.. ‘వాట్టే బ్యూటీ’, ‘సింగిల్ యాంథెమ్’ సాంగ్స్‌కి మంచి స్పందన వస్తోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘సింగిల్స్ యాంథెమ్’ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. నితిన్ వింటేజ్ లుక్‌లో బాగున్నాడు. సింగిల్‌గా ఉండే యువకుడు ప్రేయసికోసం పరితపించే నేపథ్యంలో తెరకెక్కించిన ఈ పాట లిరికల్‌గానూ, విజువల్‌గానూ  ఆకట్టుకుంటోంది.

మహతి స్వరసాగర్ ట్యూన్‌కి శ్రీమణి లిరిక్స్ రాయగా అనురాగ్ కులకర్ణి పాడారు. ఫిబ్రవరి 14న సింగిల్ యాంథెమ్ పాడుతున్న నితిన్ ఫిబ్రవరి 15న నిశ్చితార్థం చేసుకోబోతుండడం విశేషం. ఫిబ్రవరి 21న ‘భీష్మ’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

BHEESHMA

Click Here>>డేంజర్ బెల్స్.. ఒక్కసారిగా 50వేల మందికి కరోనా వైరస్