Bigg Boss 5 : షన్ను ఫేక్ అంటూ ఏడ్చేసిన సిరి

సిరి చిన్న చిన్న వాటికీ కూడా గొడ‌వ పెట్టుకొని షన్ను పట్టించుకోకపోవడంతో మళ్ళీ తానే బాధపడుతుంది. ఇవాళ రిలీజ్ చేసిన ప్రోమోలో సిరి మ‌రోసారి ఏడ్చేస్తూ ష‌ణ్ను మీద అసంతృప్తి వ్య‌క్తం చేసి

Shannu Siri

Bigg Boss 5 :  ఈ సీజన్ బిగ్ బాస్ లో గొడవలు, ఏడుపులు తప్ప ఏమి కనపడట్లేదు. గత రెండు రోజుల నుంచి కెప్టెన్సీ టాస్క్ కోసం కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒక పక్క గొడవలు జరుగుతుంటే కొందరు ఏడుస్తూ అలుగుతున్నారు. బిగ్‌బాస్ షోలో ఏదైనా జరగొచ్చు. ఫ్రెండ్స్‌ను శ‌త్రువులుగా, శ‌త్రువులను మిత్రువులుగా మార్చేస్తాడు బిగ్ బాస్. ఇప్పటికి అలా చాలా సార్లు జరిగింది. ఈ సీజన్ లోనే ఆలా జరిగింది. తాజాగా మరో ఇద్దరు మిత్రులు శత్రువులుగా మారబోతున్నారు అని అర్ధమవుతుంది ఎపిసోడ్స్ చూస్తుంటే.

Bigg Boss Swetha : లక్ష రూపాయలిచ్చి నన్ను కమిట్మెంట్ అడిగారు : బిగ్ బాస్ శ్వేత

హౌస్‌లో సిరి, ష‌ణ్ను ఇద్దరూ మంచి స్నేహితులు. వీళ్ళు హౌస్ కి రాకముందు నుంచి ఫ్రెండ్స్. బిగ్ బాస్ లోకి వచ్చాక కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. అయితే షన్ను సొంతంగా గేమ్ ఆడినా సిరి మాత్రం చాలా వరకు షన్నుతో కలిసి ఆడటానికి ట్రై చేస్తుంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఫైట్ న‌డుస్తోంది. గ‌త రెండు రోజులుగా వీరి మ‌ధ్య‌ మ‌న‌స్ప‌ర్థ‌లు, గొడ‌వ‌లు జరుగుతున్నాయి. అవి ఇవాళ ఇంకా ఎక్కువ అయ్యేలా ఉన్నాయని తెలిసేలా ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో షన్ను కెప్టెన్ గా ఏదో పని చేయడంతో సిరి షన్నుని ఉద్దేశించి.. స్నేహితుడిగా త‌న‌కు స‌పోర్ట్ చేయాల్సిన‌వాడే జెన్యూన్‌గా ఆడట్లేదు, అంద‌రూ స‌పోర్ట్ చేసుకుంటూ ఆడుతున్నారు, వాడికి ఫ్రెండ్‌షిప్ విలువ తెలిస్తే క‌దా, అంతా ఫేక్, మ‌న‌సులో ఒక‌టి పెట్టుకుని బ‌య‌ట‌కు ఒక‌లా ఉంటున్నాడు. నా ఫ్రెండ్‌షిప్‌కు వాల్యూ లేకుండా అయిపోయింది అంటూ అరుస్తూ ఏడ్చేసింది సిరి.

Blakrishna : బాలకృష్ణ సినిమాలో విలన్ గా చేయడానికి నేను రెడీ : మోహన్ బాబు

సిరి చిన్న చిన్న వాటికీ కూడా గొడ‌వ పెట్టుకొని షన్ను పట్టించుకోకపోవడంతో మళ్ళీ తానే బాధపడుతుంది. ఇవాళ రిలీజ్ చేసిన ప్రోమోలో సిరి మ‌రోసారి ఏడ్చేస్తూ ష‌ణ్ను మీద అసంతృప్తి వ్య‌క్తం చేసింది. మరి ఈ గొడవ ఎక్కడి దాక వెళ్తుందో తెలియాలి అంటే రాత్రి ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే. దీని పై షన్ను అభిమానులు సోషల్ మీడియాలో సిరిపై కామెంట్స్ చేస్తున్నారు. ష‌ణ్ను త‌న స్నేహాన్ని ప‌క్క‌న‌పెట్టి కెప్టెన్‌గా త‌న బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నాడ‌ని, అత‌డు ఫేక్ కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. సిరి అన‌వ‌స‌రంగా మ‌రీ ఎమోష‌న‌ల్ అయిపోయి అటు త‌న గేమ్‌తో పాటు ష‌ణ్ను గేమ్ కూడా పాడు చేస్తుంది అంటున్నారు.