Siri Hanumanth : పెళ్లి కాకుండానే తల్లి అయ్యాను అని చెప్పిన బిగ్ బాస్ కంటెస్టెంట్

పాపులర్ అయిన వాళ్లలో ఒకరు సిరి హనుమంత్. సిరి షార్ట్ ఫిలిమ్స్ నుంచి తన ప్రయాణం మొదలు పెట్టి వెబ్ సిరీస్ లు, సీరియల్స్ చేస్తూ వస్తుంది. యూట్యూబ్ లో తన ఛానల్ లో వరుసగా వెబ్ సిరీస్ లు

Siri (1)

Siri Hanumanth :  ప్రస్తుతం బిగ్ బాస్ షో లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్లలో కొంతమంది మాత్రమే జనాలకి తెలుసు. ఇంకొంతమంది సోషల్ మీడియా డిజిటల్ మీడియాలో బాగా పాపులర్. అలా పాపులర్ అయిన వాళ్లలో ఒకరు సిరి హనుమంత్. సిరి షార్ట్ ఫిలిమ్స్ నుంచి తన ప్రయాణం మొదలు పెట్టి వెబ్ సిరీస్ లు, సీరియల్స్ చేస్తూ వస్తుంది. యూట్యూబ్ లో తన ఛానల్ లో వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇంస్టాగ్రామ్ లో కూడా ఈ అమ్మడికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు.

ఈ యూట్యూబ్ స్టార్ సిరి హ‌న్మంత్‌కు మరో యూట్యూబ్ నటుడు శ్రీహాన్‌తో ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది. వీరిద్దరూ కలిసి వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. కొద్ది రోజుల‌లో పెళ్లి కూడా చేసుకుందాము అనుకున్నారు. బిగ్ బాస్ ఆఫ‌ర్ రావ‌డంతో పెళ్ళికి కాస్త బ్రేక్ ఇచ్చారు. యూట్యూబ్ లోను జోడిగా నటించి నిజ జీవితంలోను జోడీగా మారబోతున్నారు. సిరి మరో ఇంటరెస్టింగ్ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది.

Shivaji Ganeshan : శివాజీ గణేశన్ జయంతి.. గూగుల్ స్పెషల్ గిఫ్ట్..

సిరి శ్రీహాన్ లు కలిసి ఓ అబ్బాయిని దత్తత తీసుకున్నారు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌ చైతూని అడాప్ట్‌ చేసుకున్నారు. ఇటీవల బిగ్ బాస్ కి రాకముందు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది ఈ భామ. ఆ సందర్భంగా ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకి మేం ఇద్దరం కలిసి చైతుని అడాప్ట్ చేసుకున్నామని, తల్లిగా నాకు కొత్త బాధ్యత వచ్చింది అని, తల్లి అనే బాధ్యతని నేను ఆస్వాదిస్తున్నాను అని తెలిపింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో సిరి – శ్రీహన్ జంటని అభినందిస్తున్నారు.