Shivaji Ganeshan : శివాజీ గణేశన్ జయంతి.. గూగుల్ స్పెషల్ గిఫ్ట్..

 ఒకప్పటి తమిళ స్టార్ హీరో శివాజీ గణేశన్ న‌టన‌కు నిలువెత్తు రూపం. ఇప్పుడున్న ఎంతోమంది తమిళ్, తెలుగు స్టార్ హీరోలకు శివాజీ గణేశన్ ఫేవరేట్ హీరో. ఆయన దగ్గర్నుంచి ఎంతో నేర్చుకున్నారు.

Shivaji Ganeshan :  శివాజీ గణేశన్ జయంతి.. గూగుల్ స్పెషల్ గిఫ్ట్..

Shivaji (1)

Shivaji Ganeshan :  ఒకప్పటి తమిళ స్టార్ హీరో శివాజీ గణేశన్ న‌టన‌కు నిలువెత్తు రూపం. ఇప్పుడున్న ఎంతోమంది తమిళ్, తెలుగు స్టార్ హీరోలకు శివాజీ గణేశన్ ఫేవరేట్ హీరో. ఆయన దగ్గర్నుంచి ఎంతో నేర్చుకున్నారు. కేవలం తమిళ్ హీరోగానే కాక దేశమంతటా తన సినిమాలతో, తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు.

1928 అక్టోబర్ 1న శివాజీ గణేశన్ తమిళనాడులోని విల్లుపురంలో జన్మించారు. ఈయన అసలు పేరు వి. చిన్నయ్య మన్రయార్ గణేశమూర్తి. ఏడేళ్ల వయసులోనే టూరింగ్ స్టేజ్ డ్రామా కంపెనీ తరపున నాటకాలు వేయడానికి తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్ళిపోయారు. స్టేజీపై ఆయన నటనను చూసి ప్రముఖ సంఘసంస్కర్త ఈవీ రామస్వామి ఆయనని నటనలో ‘శివాజీ’గా అభివర్ణించాడు. దాంతో ఆయన తన పేరుని శివాజీ గణేష‌న్‌ గా మార్చుకున్నారు.

Republic Movie : రిపబ్లిక్ సినిమాకి వైసీపీ నాయకుల సెగ

1952లో ‘పరాశక్తి’ సినిమా ద్వారా ఆయన తమిళ్ సినిమాలోకి ప్రవేశించారు. 1953లో ‘పరదేశి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి దాదాపు 300 సినిమాల్లో నటించారు. శివాజీ గణేశన్ మొదట డబ్బింగ్ చెప్పేవారు. ఆ తర్వాత హీరో గా మారారు. హీరోగా మరీనా తర్వాత కూడా కొంత మంది తెలుగు, తమిళ్ నటులకి డబ్బింగ్ చెప్పేవారు. శివాజీ గణేశన్ ఎన్టీఆర్ తో కూడా కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. తమిళంలో శివాజీ గణేశన్ నటించిన సినిమాలను తెలుగులో ఎన్టీఆర్, ఏయన్నార్ లు రీమేక్ చేసేవారు. హీరోగా కెరీర్ అయిపోయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు.

శివాజీ గణేశన్ కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి జాతీయ అవార్డులను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ జాతీయ అవార్డును, అలాగే తమిళ్ లో ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఆయన వారసుడు ప్రభు కూడా అనేక చిత్రాలలో హీరోగా నటించారు, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. కానీ శివాజీ గణేశన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ కమల్ హాసన్ ను తన నటవారసునిగా ప్రకటించారు.
2001 జూలై 21న శివాజీ గణేశన్ కన్నుమూశారు.

Tammareddy : పవన్ కళ్యాణ్ స్పీచ్ పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఇవాళ ఆయ‌న 93వ జ‌యంతి సంద‌ర్భంగా సెర్చ్ దిగ్గజం గూగుల్‌ డూడుల్‌తో ఆయన్ని గుర్తు చేసింది. ఇవాళంతా గూగుల్ మెయిన్ పేజీలో ఆయన కనపడేలాగా డూడుల్ ని పోస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన నూపూర్‌ రాజేష్‌ చోక్సీ అనే వ్యక్తి ఈ డూడుల్‌ను క్రియేట్‌ చేశాడు.