Republic Movie : రిపబ్లిక్ సినిమాకి వైసీపీ నాయకుల సెగ

రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ మాట్లాడిన స్పీచ్ వల్ల జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. ఆ స్పీచ్ మాట్లాడిన రోజు నుంచి ఇవాళ్టి వరకు ఎవరో ఒకరు దానిపై స్పందిస్తున్నారు,

Republic Movie : రిపబ్లిక్ సినిమాకి వైసీపీ నాయకుల సెగ

Republic (1)

Updated On : October 1, 2021 / 12:02 PM IST

Republic Movie :  రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ మాట్లాడిన స్పీచ్ వల్ల జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. ఆ స్పీచ్ మాట్లాడిన రోజు నుంచి ఇవాళ్టి వరకు ఎవరో ఒకరు దానిపై స్పందిస్తున్నారు, విమర్శిస్తున్నారు. ఈ స్పీచ్ పై ఇప్పటికే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జనసేన నాయకులు కూడా తిరిగి కౌంటర్ ఇస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పట్లో ఆగేలా లేదు. ఈ స్పీచ్ ఎఫెక్ట్ ఇప్పుడు రిపబ్లిక్ సినిమాపై ప్రభావం చూపిస్తుంది.

సాయి ధరమ్ తేజ్ ఆక్సిడెంట్ అయి హాస్పిటల్ లో ఉండటంతో సినిమాకి సపోర్ట్ ఉంటుంది, ప్రమోషన్ అవుతుంది అని పవన్ కళ్యాణ్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలిచారు. కానీ పవన్ ఇలా ఆవేశంతో మాట్లాడేసరికి ఇప్పుడు ఈ సినిమా యూనిట్ కి కొత్త తలనొప్పి వచ్చింది. ఇవాళ రిపబ్లిక్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఏపీ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రిపబ్లిక్ సినిమాను వైసిపి నాయకులు అడ్డుకున్నారు. సినిమా చూసేందుకు వచ్చిన జనాలను కూడా వెనక్కి పంపించేశారు.

Allu Ramalingayya : అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం ఆవిష్కరించిన వారసులు..

సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండిస్తూ సినిమా థియేటర్ ఎదుట ధర్నా చేశారు. పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఇవాళ వైసీపీ నాయకులు రిపబ్లిక్ సినిమాని అడ్డుకోవాలని చూస్తున్నారు.