Chiranjeevi : ‘సిరివెన్నెల’ హీరోతో మెగాస్టార్

'సిరివెన్నెల' సినిమాలో మెయిన్ లీడ్ లో అంధుడిగా పండిత్ హ‌రి ప్ర‌సాద్ అనే పాత్ర ఉంటుంది. ఈ పాత్రలో బెన‌ర్జీ జీవించారు. ఆ తర్వాత బెన‌ర్జీ మెగాస్టార్ చిరంజీవి 'స్వ‌యంకృషి' సినిమాలో....

Chiranjeevi : ‘సిరివెన్నెల’ హీరోతో మెగాస్టార్

Sirivennela

Updated On : December 14, 2021 / 8:19 AM IST

Chiranjeevi :  తెలుగు సినీ పరిశ్రమలో క‌ళాత‌పస్వి కే.విశ్వ‌నాథ్ ఎన్నో మంచి సినిమాలని అందించారు. ఎంతోమంది ఆర్టిస్టులని పరిచయం చేశారు. ఆయన తీసిన సినిమాల్లో ఒక ఆణిముత్యం ‘సిరివెన్నెల’ సినిమా. ఈ సినిమా మంచి విజయం సాధించి క్లాసికల్ హిట్ గా చరిత్రలో నిలిచిపోయింది. ఈ చిత్రంతో యూపీ న‌టుడు స‌ర్వ‌దామ‌న్ డీ బెన‌ర్జీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు పరిచయం చేశారు.

‘సిరివెన్నెల’ సినిమాలో మెయిన్ లీడ్ లో అంధుడిగా పండిత్ హ‌రి ప్ర‌సాద్ అనే పాత్ర ఉంటుంది. ఈ పాత్రలో బెన‌ర్జీ జీవించారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల మనసులో ఎప్పటికి నిలిచిపోతుంది. ఆ తర్వాత బెన‌ర్జీ మెగాస్టార్ చిరంజీవి ‘స్వ‌యంకృషి’ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించాడు. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరూ కలుసుకున్నారు.

Samantha : సమంతపై వచ్చే పుకార్లను నమ్మొద్దు : సమంత మేనేజర్

నిన్న చిరంజీవి ఇంట్లో బెనర్జీ చిరంజీవిని కలిశారు. వీరిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పాత జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నారు. వీరిద్దరూ కౌగిలించుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి.. ”ఎంతో విన‌యం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వ‌భావం క‌లిగిన వ్య‌క్తి చిరంజీవి. చిరంజీవితో ఆయ‌న ఇంట్లో కలవడం సంతోషంగా ఉంది” అంటూ బెన‌ర్జీ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.