Sitara Ghattamaneni : సినిమా ఎంట్రీ ఇవ్వకుండానే బ్రాండ్ అంబాసడర్ ఛాన్స్ కొట్టేసిన సితార.. మహేష్ కూతురా మజాకా!
ఒక సినిమా కూడా చేయకుండానే మహేష్ బాబు కూతురు సితార ఒక బ్రాండ్ కాంట్రాక్ట్ అందుకుంది. ప్రముఖ జ్యువలరీ బ్రాండ్ కి అంబాసడర్ గా..

Sitara Ghattamaneni bag a major jewellery brand contract without doing one movie
Mahesh Babu : టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్కువుగా కమర్షియల్ యాడ్స్ చేస్తూ, పలు సంస్థలకు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తాడని అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు మహేష్ కూతురు కూడా బ్రాండ్ అంబాసడర్ గా మారిపోయింది. మహేష్ గారాల పట్టి సితార.. సినిమా ఎంట్రీ ఇవ్వకుండానే ఎంతో ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ లో డాన్స్ వీడియోలు చేస్తూ అందర్నీ ఆకర్షిస్తుంది. సితార ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ 1.2M పైగా ఉన్నారు.
అలాగే మహేష్ బాబుతో కలిసి ఇప్పటికే పలు సీరియల్ ప్రమోషన్స్ లో కనిపించి అలరించింది. ఇక ఇప్పుడు సింగల్ గా తానే ఒక ఒక కమర్షియల్ యాడ్ చేస్తూ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రముఖ జ్యువలరీ బ్రాండ్ కి అంబాసడర్ గా వ్యవహరించబోతుంది. ఈ బ్రాండ్ కి యాడ్ షూటింగ్ ని ఇటీవలే పూర్తి చేస్తారు. అందుకు సంబంధించిన షూటింగ్ సెట్ లోని వీడియోని సితార తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. త్వరలోనే ఆ యాడ్ కూడా ప్రసారం కానుంది. ఇక ఒక సినిమా కూడా చేయకుండానే సితార ఒక బ్రాండ్ కాంట్రాక్ట్ అందుకోవడంతో మహేష్ అభిమానులు సితారని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Sitara Ghattamaneni bag a major jewellery brand contract without doing one movie
కాగా మహేష్ నటిస్తున్న SSMB28 మూవీ నుంచి చిత్ర యూనిట్ తాజాగా అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ టైటిల్ ని ఈ నెల 31న రిలీజ్ చేయబోతున్నారు. ఆ రోజున కృష్ణ సూపర్ హిట్ మూవీ మోసగాళ్లకు మోసగాడు సినిమా రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాతో పాటు బిగ్ స్క్రీన్ పై SSMB28 టైటిల్ ని అనౌన్స్ చేయబోతున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ని ఒకటి రిలీజ్ చేశారు. అందులో మహేష్ తలకి ఎర్ర కండువా చుట్టుకొని, గళ్ళ చొక్కా, నోటిలో బిడితో పక్కా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.

Mahesh Babu New look from SSMB28