Mahesh Babu : కళావతి స్టెప్పులతో మహేష్ ని దించేసిన సితార..

తాజాగా కళావతి పాటకు మహేశ్‌ కూతురు సితార కూడా అదిరిపోయే స్టెప్పులు వేసింది. సితార సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది అన్న సంగతి అందరికి తెలిసిందే. తన ఫోటోలు, డ్యాన్సులు........

Kalavathi

Sithara :  సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ లో ఉంది. పరశురామ్ దర్శకత్వంలో జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. ఇటీవలే ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్ అయింది. ‘కళావతి’ అంటూ సాగే ఈ పాట అందర్నీ ఆకట్టుకొని యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచింది. ఇప్పటికే 35మిలియన్‌ వ్యూస్‌ దాటి దూసుకుపోతుంది.

ఎక్కడ చూసినా ఇప్పుడు అంతా కళావతి సాంగ్ ని రిపీట్ మోడ్ లో వింటున్నారు. ఈ పాటలో మహేష్ అదిరిపోయే స్టెప్పులు వేశారు. చాలా క్లాస్ స్టెప్పులతో అందర్నీ ఆకట్టుకున్నారు. ప్రేక్షకులు ఈ సాంగ్ తో పాటు స్టెప్పులకి కూడా ఫిదా అయిపోయారు. ఇక సోషల్ మీడియాలో రీల్స్ తో నెటిజన్లు ఈ స్టెప్పులు వేసి పాటని మరింత పాపులర్ చేస్తున్నారు.

Bhumi Pednekar : బాలీవుడ్‌లో లింగ వివక్ష.. హీరోయిన్లకి సగం పారితోషకం..

తాజాగా కళావతి పాటకు మహేశ్‌ కూతురు సితార కూడా అదిరిపోయే స్టెప్పులు వేసింది. సితార సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది అన్న సంగతి అందరికి తెలిసిందే. తన ఫోటోలు, డ్యాన్సులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్ ఆద్యతో కలిసి యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తుంది. తాజాగా ‘కళావతి’ సాంగ్ కి తండ్రి లాగే స్టెప్పులు దించేసింది. కళావతి సాంగ్ కి స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో సితార పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది. అభిమానులు, నెటిజన్లు మహేష్ లాగే సూపర్ గా వేశావంటూ అభినందిస్తున్నారు సితారని.