Ayalaan : శివకార్తికేయన్ అయలాన్ సినిమాలో ఏలియన్ గా నటించింది ఎవరో తెలుసా? మరుగుజ్జు నటుడు..

శివకార్తికేయన్ ఈ సారి ఏలియన్స్ నేపథ్యంలో ఓ సరికొత్త కథతో పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఆర్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అయలాన్’.

Ayalaan : శివకార్తికేయన్ అయలాన్ సినిమాలో ఏలియన్ గా నటించింది ఎవరో తెలుసా? మరుగుజ్జు నటుడు..

Siva Karthikeyan Ayalaan Movie Alian Character Artist Details

Updated On : October 11, 2023 / 1:00 PM IST

Ayalaan Movie : తమిళ్(Tamil) స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) కు తెలుగులో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల శివకార్తికేయన్ సినిమాలన్నీ తెలుగులో రిలీజయి ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. గత సంవత్సరం అనుదీప్(Anudeep) దర్శకత్వంలో ప్రిన్స్(Prince) సినిమాతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ కూడా ఇచ్చాడు శివ కార్తికేయన్. ఇటీవల మహా వీరుడు సినిమాతో వచ్చి పర్వాలేదనిపించాడు.

శివకార్తికేయన్ ఈ సారి ఏలియన్స్ నేపథ్యంలో ఓ సరికొత్త కథతో పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఆర్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అయలాన్’. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. తమిళ్ లో ‘అయలాన్’ అంటే ‘ఏలియన్’ అని అర్థం. సైన్స్ ఫిక్షన్, కామెడీ కథాంశంతో ఈ సినిమా ఉండబోతుంది.

ఇటీవలే అయలాన్ సినిమా టిజర్ రిలీజ్ చేయగా సినిమాపై ఆసక్తి నెలకొంది. ఒక ఏలియన్ భూమి మీదకు వచ్చి అది శివ కార్తికేయన్ దగ్గరికి వస్తే, మరో వైపు ప్రపంచాన్ని నాశనం చేద్దాం అనే ఆలోచనతో విలన్ ఉండటం.. అనే అంశాలతో ఆసక్తికరంగా సినిమా ఉండబోతున్నట్టు టీజర్ చూస్తే తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఏలియన్ పాత్రను ఓ మరుగుజ్జు నటుడు చేశాడు.

Also Read : RGV : ఆర్జీవీ వ్యూహం, శపథం.. రెండు సినిమాలు రిలీజ్‌కి రెడీ.. ఎప్పుడో తెలుసా?

తమిళనాడుకి చెందిన వెంకట్ సెంగుట్టువన్ అనే మరుగుజ్జు నటుడు అయలాన్ సినిమాలో ఏలియన్ పాత్ర చేశాడు. ఈ పాత్రకు మరుగుజ్జు నటులు కావాలని ఆడిషన్ కి పిలవగా చాలా మంది వస్తే అందులో ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నారు చిత్రయూనిట్. పలు తమిళ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు వెంకట్. ఈ సినిమాలో హీరో కంటే వెంకట్ ఎక్కువ కష్టపడ్డాడట. ఆ ఏలియన్ గెటప్ తో, గెటప్ లేకుండా కొన్ని గ్రాఫిక్ షాట్స్ కోసం.. ఇలా హీరో కంటే కూడా ఇతనే ఎక్కువ కష్టపడ్డట్టు శివకార్తికేయన్ ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో తెలిపాడు. మరి ఈ సినిమా వెంకట్ కెరీర్ గ్రాఫ్ ని మారుస్తుందేమో చూడాలి. ఇప్పటికే ఏలియన్ క్యారెక్టర్ తో అతనికి ఒక గుర్తింపు వస్తుంది. ఈ సినిమా దీపావళికి రిలీజ్ కానుంది.