శివ కార్తికేయన్‌ మూవీ ‘అమరన్‌’ ట్రైలర్ విడుదల

ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను హీరో నాని విడుదల చేస్తూ.. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

శివ కార్తికేయన్‌ మూవీ ‘అమరన్‌’ ట్రైలర్ విడుదల

Updated On : October 23, 2024 / 7:15 PM IST

శివ కార్తికేయన్‌ కొత్త సినిమా ‘అమరన్‌’ ట్రైలర్ ఇవాళ విడుదలైంది. దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి నటిస్తోంది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ఈ సినిమా విడుదల కానుంది.

Also Read: సల్మాన్ దెబ్బకి.. రష్మికకి కూడా భారీ బందోబస్త్..?

ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను హీరో నాని విడుదల చేస్తూ.. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఉగ్రదాడిలో అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఈ సినిమాను రాజ్ కమల్‌ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. దేశం కోసం చేసిన పోరాట సన్నివేశాలను ఈ ట్రైలర్‌లో చూపించారు. ఆ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఎమోషనల్ సీన్స్‌ ను కూడా ట్రైలర్‌లో చూపించారు.