SJ Suryah : మహేష్ బాబుకి నేను బాకీ ఉన్నా.. ఎప్పటికైనా ఆ బాకీ తీర్చేస్తా..

తమిళ నటుడు ఎస్ జె సూర్య మహేష్ బాబుకి తాను బాకీ పడినట్లు చెప్పుకొచ్చాడు. ఎప్పటికైనా ఆ బాకీని..

SJ Suryah : మహేష్ బాబుకి నేను బాకీ ఉన్నా.. ఎప్పటికైనా ఆ బాకీ తీర్చేస్తా..

SJ Suryah said he is debt for Mahesh Babu with Nani movie flop

Updated On : September 11, 2023 / 8:27 PM IST

SJ Suryah : తమిళ నటుడు ఎస్ జె సూర్య.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ ఆర్టిస్ట్ అయ్యిపోయాడు. తన విలక్షణ నటనతో ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నాడు. విలన్‌గా, కమెడియన్‌గా, హీరోగా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. తాజాగా విశాల్ ‘మార్క్ ఆంటోనీ’ (Mark Antony) సినిమాలో ప్రధాన పాత్రని పోషించాడు. ఇక ఈ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ జె సూర్య మాట్లాడుతూ.. మహేష్ బాబుకి (Mahesh Babu) తాను బాకీ పడినట్లు చెప్పుకొచ్చాడు.

Genelia : మూడోసారి తల్లి కాబోతున్న జెనీలియా..? స్పందించిన భ‌ర్త.. ఏమ‌న్నాడంటే..?

ఎస్ జె సూర్య నటుడు మాత్రమే కాదు దర్శకుడు అన్న విషయం కూడా అందరికి తెలిసిందే. అటు తమిళ సూపర్ స్టార్స్ అజిత్, విజయ్‌లతో, ఇటు తెలుగు సూపర్ స్టార్స్ మహేష్, పవన్‌తో సూర్య సినిమాలు చేశాడు. అజిత్‌కి ‘వాలి’, విజయ్ అండ్ పవన్‌కి ‘ఖుషి’ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. కానీ మహేష్ తో తీసిన సినిమానే వర్క్ అవుట్ అవ్వలేదు. 2004లో మహేష్ తో ‘నాని’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు సూర్య. సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది.

Peddha Kapu 1 : రా అండ్ రస్టిక్‌గా పెదకాపు-1 ట్రైలర్.. శ్రీకాంత్ అడ్డాల అదరగొట్టేశాడు..

ఈ ఒక్క విషయం తనని ఎప్పుడు బాధపెడుతుంటుందని ఎస్ జె సూర్య చెప్పుకొచ్చాడు. “అజిత్, విజయ్, పవన్ కి బ్లాక్ బస్టర్స్ ఇచ్చి మహేష్ ఇవ్వలేకపోయాను. ఈ బాకీని ఎప్పటికైనా తీర్చుకుంటాను. ఎప్పటికైనా మహేష్ బాబుతో సినిమా తీసి బ్లాక్ బస్టర్ ఇస్తాను. ఇది నా మాట” అంటూ ఈవెంట్ ఎస్ జె సూర్య వెల్లడించాడు. మరి వీరిద్దరి కాంబినేషన్ మళ్ళీ సెట్ అవుతుందా..? లేదా..? చూడాలి.