Skanda OTT : అనుకున్న స‌మ‌యానికి కంటే ముందుగానే ఓటీటీలోకి రామ్,బోయపాటి సినిమా..! స్ట్రీమింగ్ ఎక్క‌డంటే..?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా స్కంద‌.

Skanda OTT : అనుకున్న స‌మ‌యానికి కంటే ముందుగానే ఓటీటీలోకి రామ్,బోయపాటి సినిమా..! స్ట్రీమింగ్ ఎక్క‌డంటే..?

Skanda OTT

Skanda OTT release date : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా స్కంద‌. ఈ చిత్రంలో శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్స్. శ్రీకాంత్, పృథ్వీ, ఇంద్రజ, గౌతమి లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ మంచి కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రంలో రామ్‌ని ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌నంత మాస్‌గా చూపించాడు బోయ‌పాటి.

కాగా.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. ఈ చిత్ర ఓటీటీ హ‌క్కుల‌కు ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్ స్టార్ సొంతం చేసుకుంది. వాస్త‌వానికి ఈ చిత్రం థియేటర్లలో విడుద‌లైన 50 రోజుల త‌రువాతే ఓటీటీలోకి తీసుకురావాలని ఒప్పందం కుదిరింద‌ట‌. అయితే.. ఇప్పుడు ముందుగానే స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అక్టోబ‌ర్ 27 నుంచి డిస్నీ+హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

Chiranjeevi : స్నేహితుడు కోసం హాస్పిటల్‌కి చిరంజీవి.. డాక్టరుతో మాట్లాడి..

తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. స్కంద చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించాడు. బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతెలా స్పెషల్‌ సాంగ్‌లో క‌నిపించింది. ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై శ్రీనివాస్‌ చిట్టూరి, పవన్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం రామ్‌ ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రానికి పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.