ఒకేసారి 30% పెంచితే చిన్న ప్రొడ్యూసర్లకు కష్టమే.. చిన్న సినిమా బతికితేనే థియేటర్లు ఉంటాయి: చిన్న నిర్మాతలు

"నాలుగు నెలల తర్వాత మాకు డబ్బులు ఇస్తున్నారు. మేము కూడా డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నాం" అని అన్నారు.

ఒకేసారి 30% పెంచితే చిన్న ప్రొడ్యూసర్లకు కష్టమే.. చిన్న సినిమా బతికితేనే థియేటర్లు ఉంటాయి: చిన్న నిర్మాతలు

Updated On : August 11, 2025 / 4:39 PM IST

సినీ కార్మికుల వేతనాలను పెంచే పరిస్థితిలో తాములేమని చిన్న నిర్మాతలు తెలిపారు. తమ వేతనాలు 30 శాతం పెంచాలని సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, అంత భారాన్ని తాము మోయలేమని చిన్న నిర్మాతలు అంటున్నారు. తమ ప్లేస్‎లో ఉండి చూస్తే తమ ప్రాబ్లమ్స్‌ ఏంటో తెలుస్తాయని అన్నారు.

ఇవాళ నిర్మాతలు ఎస్‌కేఎన్, ధీరజ్, రాజేశ్ దండా, ప్రైమ్‌షో చైతన్య, శివలంక కృష్ణ ప్రసాద్, బెక్కం వేణుగోపాల్, చాయ్ బిస్కట్ శరత్, అనురాగ్, మధుర శ్రీధర్, మహేశ్వర్ రెడ్డి, వంశీ నందిపాటి మీడియా సమావేశంలో మాట్లాడారు.

“ఒకేసారి 30% పెంచడం అనేది ప్రొడ్యూసర్లందరికీ ఇబ్బందికర విషయం. ఏరోజు వేతనాలు ఆ రోజు ఇవ్వాలని కూడా అందరూ అడుగుతున్నారు. ఇక్కడ ప్రొడ్యూసర్లు అందరూ హ్యాపీగా ఉన్నారా? లేదా? అని గుండె మీద చేసుకొని చెప్పమంటే ఎవ్వరూ హ్యాపీగా లేరు.

ఒక సినిమా హిందీ డబ్బింగ్ కొనుక్కుంటే సినిమా ఆడలేదని రిలీజ్ తర్వాత రూ.50 లక్షలు ఇవ్వకుండా ఆపేస్తున్నారు. ఓటీటీ.. రిలీజ్ తర్వాత 50% వన్ మంత్ అగ్రిమెంట్ ఉంటుంది. కానీ, నాలుగు నెలల తర్వాత మాకు డబ్బులు ఇస్తున్నారు. మేము కూడా డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నాం.

ఏ రోజు డబ్బులు ఆ రోజే ఇవ్వాలనేది మాత్రం చాలా ఇబ్బందిగా పరిస్థితి. నా సినిమాలో లాస్ట్ ఇయర్ సెట్లో 250 మంది జూనియర్లు ఉన్నారు. అక్కడ కరెక్ట్ గా కార్డు ఉన్నవాళ్లు 50 మంది కూడా లేరు. మిగతా వాళ్లు ఎవరు మరి? యూనియన్ ఏం చేస్తుంది? అంతా మాట్లాడుకుని అందరూ ఒక తాటి మీదకు వచ్చి సపోర్ట్ చేయాలి. చిన్న సినిమా బతికితేనే థియేటర్లు ఉంటాయి. మీడియా వాళ్లు అందరూ సపోర్ట్ చేసి ఈ సమస్యను తొందరగా సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ప్రొడక్షన్ కాస్ట్  డబుల్ అయిపోయింది..
“సినిమా బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. బడ్జెట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే ప్రొడక్షన్ కాస్ట్ చాలా పెరుగుతుంది. అది కంట్రోల్ లో లేకుండా అయిపోయింది. మనకి షూటింగ్ కి ఎంతమంది కావాలి? షూటింగ్ ఎక్కడ చేస్తున్నాం? అనే పాయింట్ వదిలేసి ప్రతిరోజు సెట్ లో 100 నుంచి 150 మెంబర్స్ ఉంటున్నారు. ఎందుకు అంటే ఓన్లీ రూల్స్, రెగ్యులేషన్స్ ఇంతమందిని పెట్టుకోవాలి.

ప్రొడ్యూసర్ సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు అనుకున్న ప్రొడక్షన్ కాస్ట్ కంటే పూర్తయ్యే సరికి ఆ కాస్ట్ డబుల్ అవుతుంది. మీడియా వారికి అందరికీ తెలుసు. బయట ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు తెలుసు, ఆడియన్స్ కి తెలుసు, ప్రొడ్యూసర్స్ తెలుసు, అందరికీ తెలుసు. ప్రొడక్షన్ కాస్ట్  డబుల్ అయిపోయింది. ఈ ఫెడరేషన్ రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి.. వాటిని మార్చాలి.. ఇప్పటికైనా నేటి పరిస్థితికి తగ్గట్టు వాటిని మార్చాలి. అవే కండిషన్స్ తో చేయాంటే ఇక్కడ సినిమాలు ఎవ్వరూ ప్రొడ్యూస్ చేయలేరు” అని చెప్పారు.

ఏ నిర్మాత ఏమన్నారు?
రాజేశ్ దండ

  • నిర్మాతలకు రావాల్సిన పెమెంట్స్ ఉంటాయి..
  • కానీ కార్మికుల వేతనాలు ఏరోజుకారోజె ఇవ్వాలని, 30 శాతం పెంచాలంటున్నారు
  • నా గత సినిమాకు 250 వర్కర్స్ రావాల్సినా అంత మంది వర్కర్స్ రాలేదు.. అప్పుడు ఫెడరేషన్ రెస్పాండ్ అవ్వలేదు..‌

మధుర శ్రీధర్

  • యూనియన్ రూల్స్ వల్ల నిర్మాతలకు నష్టం..
  • పని ఉండేది నలుగురికే అయినా.. 80 మంది ఉంటారు..
  • నా కథను రూ.50 లక్షల్లో చెప్పాలనుకుంటే , రెండు కోట్ల రూపాయలు అవుతుంది.
  • నిర్మాతల నెత్తిన ఎందుకు ఇంతమందిని రుద్దుతున్నారనేది మా ప్రశ్న..

చైతన్య రెడ్డి

  • మాకు నచ్చిన వారిని ఎందుకు మేము పెట్టుకోకూడదు.
  • సినీ ఎంప్లాయిస్ కు నిర్మాతలు పని కల్పిస్తున్నాము.
  • ఇప్పుడున్న పరిస్దితుల్లో వేతనపెంపు భారమే.
  • ప్రపంచవ్యాప్తంగా ఏ వ్యాపారం సరిగ్గా నడవటం లేదు.
  • పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకోవాల్సిన అవసరం ఉంది.
  • ఏ నిర్మాతకు సినిమాల వల్ల డబ్బులు సంపాదించటం లేదు. ఎవరు హ్యాపీగా ప్రాఫిట్స్ లో లేరు.
  • కేవలం సినిమా మీద ప్యాషన్ తో సినిమాలు చెస్తున్నాము.
  • బాహుబలి , పుష్ప , హనుమాన్ లాంటి గొప్ప సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్నాయి.
  • కానీ నిర్మాతల పరిస్థి తి కార్మికులకు తెలుసు.
  • ఈ సిట్యువేషన్ లో వేతనాల పెంపు చేయలేము.
  • కోవిడ్ అనంతరం కార్మికులకు హైక్ అడిగితే ఇచ్చాం.
  • ఇప్పుడున్న పరిస్థితిని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము.