Cheekatilo
Cheekatilo : నాగచైతన్యతో పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ తన కొత్త సినిమాతో రాబోతుంది. శోభిత ధూళిపాళ, విశ్వదేవ్ రాచకొండ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘చీకటిలో’. చైతన్య, విశాలాక్షి, ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.(Cheekatilo)
చీకటిలో సినిమా జనవరి 23న ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఒక న్యూస్ ఛానల్ లో జాబ్ మానేసి క్రైమ్స్ కి సంబంధించిన విషయాలను పాడ్ కాస్ట్ ద్వారా చెప్తూ ఉంటుంది సంధ్య(శోభిత). వరుసగా కొన్ని హత్యలు, రేప్స్ జరుగుతూ ఉంటాయి. మరి తన పాడ్ కాస్ట్ ల వల్ల సంధ్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? విలన్ ఎవరు అని క్రైమ్ థ్రిల్లర్ గా సాగనున్నట్టు తెలుస్తుంది.
Also Read : Rajasaab Collections : ప్రభాస్ రాజాసాబ్ మూడు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లు తెలుసా..?
మీరు కూడా చీకటిలో ట్రైలర్ చూసేయండి..
ట్రైలర్ రిలీజ్ అనంతరం డైరెక్టర్ శరణ్ కొపిశెట్టి మాటల్లో.. ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీ మాత్రమే కాదు భయం లేకుండా నిజం కోసం పోరాడే ధైర్యం గురించి చెప్పే కథ అని అన్నాడు. శోభితా ధూళిపాళ మాట్లాడుతూ.. సంధ్య పాత్ర ఎవరి మాట వినకుండా తనకి నచ్చింది చేసే ఒక స్వతంత్రమైన అమ్మాయి. నేను తెలుగు అమ్మాయిని కావడంతో హైదరాబాద్ నేపథ్యంలో చేసే ఈ పాత్ర చాలా సహజంగా అనిపించింది. ‘మేడ్ ఇన్ హెవెన్’ తర్వాత మళ్ళీ ప్రైమ్ వీడియోతో కలిసి పనిచేస్తున్నాను అని తెలిపింది.