Hello Baby Movie : సోలో క్యారెక్టర్ తో సినిమా.. రిలీజ్ కి ముందే అవార్డు..

త్వరలో సోలో క్యారెక్టర్ తో హలో బేబీ అనే ఒక సినిమా రాబోతుంది.

Hello Baby Movie : సోలో క్యారెక్టర్ తో సినిమా.. రిలీజ్ కి ముందే అవార్డు..

Solo Character Movie Hello Baby Actress Kavya Keerthi Received Purasakar Nandi Award

Updated On : July 11, 2024 / 2:32 PM IST

Hello Baby Movie : ఇటీవల సోలో క్యారెక్టర్ తో సినిమాలు బాగానే వస్తున్నాయి. త్వరలో సోలో క్యారెక్టర్ తో హలో బేబీ అనే ఒక సినిమా రాబోతుంది. కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాణంలో రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ అనే సినిమా తెరకెక్కింది. ఒక్క క్యారెక్టర్ తో హ్యాకింగ్ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గతంలో ఆల్రెడీ ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్, సాంగ్స్ విడుదల చేశారు.

ఆల్రెడీ విడుదల సిద్ధంగా ఉన్న ఈ హలో బేబీ సినిమాని పలు అవార్డు వేడుకలకు పంపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన పురస్కార్ నంది అవార్డ్స్ వేడుకల్లో హలో బేబీ సినిమాలో నటించిన కావ్య కీర్తి నటనకు గాను పురస్కార్ నంది అవార్డు దక్కింది. ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రాజేంద్ర, మహర్షి రాఘవ.. పలువురు ప్రముఖుల చేతుల మీదుగా కీర్తి కావ్య ఈ అవార్డు అందుకుంది.

Also Read : Viraaji Teaser : వరుణ్ సందేశ్ ‘విరాజి’ టీజర్ చూశారా? బేబీ డైరెక్టర్ చేతుల మీదుగా రిలీజ్..

అవార్డు అందుకున్న అనంతరం కావ్య కీర్తి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే మొట్టమొదటి హాకింగ్ విత్ సోలో క్యారెక్టర్ తో తీసిన హలో బేబీ సినిమాలో నా నటనకు ఈ పురస్కార్ నంది అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. మా మూవీ టీమ్ సపోర్ట్ చాలా ఉంది అని తెలిపింది. నిర్మాత ఆదినారాయణ మాట్లాడుతూ.. ఈ కథని విన్నాక కచ్చితంగా అవార్డ్స్ వస్తాయని భావించాను. అందుకే ఈ సినిమా తీసాను. మరిన్ని అవార్డు వేడుకలకు ఈ సినిమాని పంపిస్తాను. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ చేస్తాను అని తెలిపారు.