Viraaji Teaser : వరుణ్ సందేశ్ ‘విరాజి’ టీజర్ చూశారా? బేబీ డైరెక్టర్ చేతుల మీదుగా రిలీజ్..

తాజాగా వరుణ్ సందేశ్ విరాజి టీజర్ రిలీజ్ చేశారు.

Viraaji Teaser : వరుణ్ సందేశ్ ‘విరాజి’ టీజర్ చూశారా? బేబీ డైరెక్టర్ చేతుల మీదుగా రిలీజ్..

Varun Sandesh Viraaji Teaser Released by director Sai Rajesh

Updated On : July 11, 2024 / 2:09 PM IST

Viraaji Teaser : వరుణ్ సందేశ్ ఇటీవలే నింద సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. మహా మూవీస్ తో కలిసి M3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాణంలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో వరుణ్ సందేశ్ హీరోగా విరాజి సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, ప్రసాద్ బెహరా.. పలువురు నటించారు.

Also Read : Ram Charan : రామ్ చరణ్ కొత్త కారు చూశారా? ఎన్ని కోట్లో తెలుసా? హైదరాబాద్‌లో ఈ కార్ ఫస్ట్ చరణ్‌కే..

విరాజి సినిమా ఆల్రెడీ షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమాని ఆగస్టు 2న రిలీజ్ చేయబోతున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు. మరో పక్క ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు మూవీ యూనిట్. తాజాగా విరాజి టీజర్ రిలీజ్ చేశారు. బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా విరాజి టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే ఇదేదో హారర్ థ్రిల్లర్ సినిమాలా అనిపిస్తుంది. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. మీరు కూడా ఈ విరాజి టీజర్ చూసేయండి..

టీజర్ రిలీజ్ అనంతరం డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. విరాజి టీజర్ చాలా బాగుంది. ముఖ్యంగా విజువల్స్ బాగున్నాయి. వరుణ్ సందేశ్ లుక్ అదిరిపోయింది. ప్రమోషన్స్ లో కూడా తన క్యారెక్టర్ గెటప్ లో పర్మనెంట్ హెయిర్ కలర్ లో ఉండటం గ్రేట్. దర్శకుడు ఆద్యంత్ హర్ష మా నెల్లూరు కావడం సంతోషంగా ఉంది. విరాజి సినిమా ఆగస్టు 2న విడుదల అవుతుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి అని అన్నారు.

Varun Sandesh Viraaji Teaser Released by director Sai Rajesh

అలాగే వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. మా విరాజి సినిమా టీజర్ ను బేబీ దర్శకుడు సాయి రాజేష్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా నాకు చాలా స్పెషల్ అని అన్నారు. డైరెక్టర్ ఆద్యంత్ హర్ష మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. వరుణ్ సందేశ్ గారి లుక్ కి కథకి చాలా దగ్గరి సంబంధం ఉంది. ఆగస్టు 2న సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది అని తెలిపారు.