బెడ్‌రూమ్‌లోకి రమ్మనడానికే మమ్మల్ని మీట్ అవుతారు.. రాయ్ లక్ష్మీ షాకింగ్ కామెంట్స్..

  • Published By: sekhar ,Published On : August 25, 2020 / 06:02 PM IST
బెడ్‌రూమ్‌లోకి రమ్మనడానికే మమ్మల్ని మీట్ అవుతారు.. రాయ్ లక్ష్మీ షాకింగ్ కామెంట్స్..

Updated On : August 25, 2020 / 6:40 PM IST

Raai Laxmi about Casting Couch: హాలీవుడ్‌లో మొదలైన ‘క్యాస్టింగ్ కౌచ్’ ఉదంతం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇండియాలోనూ పలు భాషల సినీ పరిశ్రమల్లో పెను సంచలనం రేపింది. మౌనంగా ఉండిపోయిన నటీనటులెందరో ధైర్యంగా తమకు జరిగిన అన్యాయం గురించి నోరు విప్పారు. ఇండస్ట్రీలో పెద్ద మనుషులుగా చెలామణీ అవుతున్న వారిపై ఆరోపణలు చేసి కోర్టుకు లాగారు. లేఖ వాషింగ్టన్, వరలక్ష్మీ శరత్ కుమార్, పార్వతి మేనన్ వంటివారు ‘క్యాస్టింగ్ కౌచ్’ విషయం గురించి గట్టిగానే స్పందించారు. తాజాగా హాట్ యాక్ట్రెస్ రాయ్ లక్ష్మీ ఈ విషయం గురించి షాకింగ్ విషయాలు చెప్పింది.
కొందరు కేవలం పడక సుఖం కోసమే హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులను అప్రోచ్ అవుతారని ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ఎలాంటి చేదు అనుభవాలు ఎదరవకుండా తన ఎంట్రీ సాఫీగానే జరిగిందని తెలిపింది. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చేవారు, బ్రేక్ కోరుకునేవారే దర్శక నిర్మాతల చేతిలో మోసపోతున్నారని.. కేవలం అటువంటి వారి వల్లే చిత్రపరిశ్రమపై వ్యతిరేక ముద్ర పడుతుందని ఆమె చెప్పింది.

ఆర్టిస్టుల ఆర్థిక పరిస్థితిని బట్టి వారి పర్సనల్ ఖర్చులు భరించడం వారితో పడుకోవడం దాని ద్వారా వారికి అవకాశాలు ఇప్పించడం వంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది కేవలం పడకసుఖం కోసమే పేరొందిన ఆర్టిస్టులను అప్రోచ్ అవుతుంటారు. ఒకవేళ వారు అడిగినదానికి ఒప్పుకోకపోతే ఆ ఆర్టిస్టుని ప్రాజెక్టులోనుంచి తీసేస్తారు.. అంటూ కామెంట్స్ చేసింది రాయ్ లక్ష్మీ.