Soniya Singh : బ్యాంకాక్, అండమాన్ అని అబద్దాలు చెప్పారు.. ఆ షోపై సోనియా సంచలన వ్యాఖ్యలు.. బిగ్ బాస్ పై కూడా కామెంట్స్..
ఇటీవల సిద్ధూ, సోనియా సింగ్ కలిసి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే కపుల్ షోలో పాల్గొన్నారు. (Soniya Singh)
Soniya Singh Comments Mad For Each Other Show
Soniya Singh : యూట్యూబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్, సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న సోనియా సింగ్ ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంది. సిద్దు పవన్ అనే మరో నటుడితో ప్రేమలో ఉండి లివ్ ఇన్ రిలేషన్ లో కూడా ఉంది ఈ భామ. ఇటీవల సిద్ధూతో కలిసి రెగ్యులర్ గా టీవీ షోలలో, సోషల్ మీడియాలో కనిపిస్తూ వైరల్ అవుతుంది.
ఇటీవల సిద్ధూ, సోనియా సింగ్ కలిసి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే కపుల్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో బాగానే మెప్పించారు కానీ మధ్యలోనే బయటకు వచ్చేసారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సోనియా ఈ షోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Also Read – CM Vijay : సొంత సినిమా రిలీజ్.. కఠిన రూల్స్ పెడుతున్న సీఎం విజయ్..
సోనియా సింగ్ మాట్లాడుతూ.. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో బ్యాంకాక్, అండమాన్ నికోబర్ లో ఉంటుంది, అక్కడికి తీసుకెళతాం అని చెప్పారు. కానీ ఇక్కడే సెట్ లో చేశారు. అయినా పక్కన సిద్దు ఉన్నాడు కాబట్టే ఆ షోకి వెళ్లాను. అందరూ మేము విన్ అవుతాము అనుకున్నారు. కానీ మధ్యలోనే బయటకు వచ్చేసాము. మాకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. మేము బాగానే చేసాము. ఏ తప్పు చేయలేదు. కానీ బయటకు వచ్చేసాము. ఎందుకో తెలీదు అని చెప్పుకొచ్చింది.
ఇక బిగ్ బాస్ లో పాల్గొంటారా అనే దానిపై మాట్లాడుతూ.. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళను. ఇప్పుడు డేట్స్ ఇవ్వలేను. వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న. ఫ్యూచర్ లో ఆలోచిస్తా. అక్కడికి వెళ్లినా సిద్దు ఉండాల్సిందే అని తెలిపింది.
