Laila : విశ్వ‌క్ సేన్ ‘లైలా’ మూవీ నుంచి ‘సోను మోడ‌ల్’ సాంగ్ వ‌చ్చేసింది.. అదిరిపోయిన స్టెప్పులు..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ న‌టిస్తున్న తాజా చిత్రం లైలా.

Sonu Model full Song out now from Vishwaksen Laila movie

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మంచి స్పీడ్‌లో ఉన్నాడు. వ‌రుసగా చిత్రాల‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం లైలా. రామ్ నారాయణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. షైన్ స్క్రీన్ పిక్చర్స్, ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్ పై సాహు గార‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ క‌థానాయిక‌.

ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా 2025 ఫిబ్ర‌వ‌రి 14న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లు పెట్టింది. వ‌రుస‌గా అప్‌డేట్‌లు ఇస్తూ ఈ మూవీపై అంచ‌నాల‌ను పెంచుతోంది.

ఫ్యాన్స్‌పై పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేసిన వేళ.. “ఓజీ” సినిమాపై డీవీవీ మూవీస్ కీలక కామెంట్స్‌

తాజాగా ఈ చిత్రం నుంచి సోను మోడ‌ల్ పాట‌ను విడుద‌ల చేసింది. విశ్వ‌క్ స్టెప్పులు అదిరిపోయాయి. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

లియోన్ జేమ్స్ సంగీతాన్ని బ్ర‌హ్మ క‌డ‌లి ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే అందించ‌గా రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి విశ్వ‌క్ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

Daaku Maharaj : ఆహా బంప‌ర్ ఆఫ‌ర్‌.. బాల‌య్యను క‌లిసే ఛాన్స్‌.. ఎలాగో తెలుసా?