Daaku Maharaj : ఆహా బంపర్ ఆఫర్.. బాలయ్యను కలిసే ఛాన్స్.. ఎలాగో తెలుసా?
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూవీ డాకు మహారాజ్.

Aha Offering to Chance meet with Balakrishna
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూవీ డాకు మహారాజ్. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా జనవరి 4వ తేదీన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అమెరికాలో భారీ ఎత్తున నిర్వహించేందుకు చిత్ర బృందం సన్నాహకాలు చేస్తోంది.
అమెరికాలోని టెక్సాస్‌లో జనవరి 4 శనివారం సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ ఈవెంట్‌కు వెళ్లే ఫ్యాన్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది.
Vaaradhi Review : ‘వారధి’ మూవీ రివ్యూ.. సస్పెన్స్ థ్రిల్లర్..
డిసెంబర్ 31లోగా ఆహా గోల్డ్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుంటే ప్రీరిలీజ్ ఈవెంట్‌ను లాంచ్‌లో కూర్చోని చూడొచ్చు. అంతేకాదండోయ్ బాలకృష్ణను కలిసే అవకాశాన్ని సైతం పొందవచ్చు. మరిఇంకెందుకు ఆలస్యం ఆహా గోల్డ్‌ను వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకుండి. డాకు మహారాజ్‌ని కలుసుకోండి.
డాకు మహారాజ్‌లో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ కథనాయికలుగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు బాబీ డియల్ విలన్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడులైన పోస్టర్లు, గ్లింప్స్, రెండు పాటలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.