Sonu Sood:బెడ్ అరేంజ్ చేస్తానన్న సోనూసూద్.. అదేం అవసర్లేదన్న జిల్లా మెజిస్ట్రేట్

కొవిడ్ మహమ్మారి ప్రజల్లో భయాలను పురిగొల్పుతుంటే... నిస్సహాయతతో నిండిపోయిన వారికి, దిక్కుతోచని పరిస్థితుల్లో కూరుకుపోయిన వారికి నేనున్నాంటూ ఆపన్న హస్తం అందిస్తున్నాడు సోనూసూద్. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న విన్నపాలను వీలైనంత వరకూ పూర్తి చేస్తున్నాడు.

Sonu Sood:బెడ్ అరేంజ్ చేస్తానన్న సోనూసూద్.. అదేం అవసర్లేదన్న జిల్లా మెజిస్ట్రేట్

Sonu Sood

Updated On : May 17, 2021 / 8:26 PM IST

Sonu Sood: కొవిడ్ మహమ్మారి ప్రజల్లో భయాలను పురిగొల్పుతుంటే… నిస్సహాయతతో నిండిపోయిన వారికి, దిక్కుతోచని పరిస్థితుల్లో కూరుకుపోయిన వారికి నేనున్నాంటూ ఆపన్న హస్తం అందిస్తున్నాడు సోనూసూద్. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న విన్నపాలను వీలైనంత వరకూ పూర్తి చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే మే15న ఒడిశాలోని బెర్హంపూర్ జిల్లా గంజాం సిటీ హాస్పిటల్ లో బెడ్ కావాలంటూ సోనూసూద్ కు రిక్వెస్ట్ పంపాడు.

దానికి రెస్పాండ్ అయిన సోనూ.. బాధపడకు. గంజాం సిటీ హాస్పిటల్ లో నీకు బెడ్ అరేంజ్ చేస్తామని రిప్లై ఇచ్చారు. కాకపోతే దానిపై గంజాం జిల్లా మెజిస్ట్రేట్ కౌంటర్ ఇచ్చారు.

మాకు సోనూసూద్ ఫౌండేషన్ నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఆ రిక్వెస్ట్ చేసిన పేషెంట్ హోం ఐసోలేషన్ లోనే ఉన్నాడు. బెడ్ సమస్యలు ఏం లేవని సమాధానమిచ్చారు.

మరోసారి రెస్పాండ్ అయిన సోనూ.. మేం మిమ్మల్ని కలిశామని చెప్పలేదు. సహాయం చేస్తానని మాటిచ్చాం. అతని వివరాలు పంపిస్తాను మీరే చెక్ చేస్కోండి అని స్ట్రాంగ్ ట్వీట్ చేశారు.

గత వారం ఫ్రాన్స్ నుంచి ఆక్సిజన్ ప్లాంట్లను తెప్పించి ఇండియాలో పలు చోట్ల ఏర్పాటు చేస్తానని సోనూ చెప్పారు. ఇండియా ప్రస్తుతం ఉన్న కీలక పరిస్థితుల్లో ఢిల్లీ, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో కనీసం నాలుగు ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు.